వాచకము, విగ్రహము, ఉచ్చారణ, హావ భావాలూ ఇవేవి లేక పోవడం ఈ రోజున తెలుగు సినిమాలలో అగ్ర నటివర్గం గా చలామణి అవుతున్న వారి యొక్క ముఖ్య అర్హతలు. వాళ్ళ నాన్న, మామ, పెదనాన్న లేక బాబాయ్ ఇలా ఎవరో ఒకరి రక్తం వీళ్ళ ఒంట్లో వుంటే చాలట వీళ్ళు కూడా మహా నటుల జాబితా లో ఇట్టే చేరి పోతారు. కాని ఈ "వా" (వారసత్వం) బ్లడ్ గ్రూప్ ఒక్క తెలుగు హీరో కులానికే వర్తిస్తుంది అట. వీధి లోకి కొత్త కుక్క వస్తే ఎలా అయితే అది నిర్దయగా తరమపడుతుందో, ఈ కుల సంతతి ఈ "హీరో" ఇజంని తమ జన్మ హక్కు గా బావిస్తుంది. ఈ హీరో వర్గం ఒక్క బాధ్యత వట్టి సినిమా లో నటించడం మాత్రమే అని అనుకొంటే మీరు పొరపాటు పడినట్టే. ఉదహరణకి వీళ్ళ సినిమాలు లో పాటించవలసిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే.
- సినిమా లో ముఖ్య నటి నట వర్గం ని మొత్తం మీద హీరో నే నిర్ణయిస్తాడు.
- హీరో యొక్క సామర్ధ్యం ని బట్టి, అతని కన్నా నటన కొంచం అయినా వచ్చిన వాళ్ళని చిన్న చిన్న పాత్రలకి లేక తమ ని ఇంకా ఎలివేట్ పద్ధతి లో తగిన జాగ్రత్త డైరెక్టర్ తో సహా కలిసి తీసుకొంటారు.
- అన్నిటి కన్నా ముఖ్యంగా హీరోయిన్ తెలుగు మాట్లాడం రాని అమ్మాయి అవ్వాలి. చెప్పా కదా మన హీరో గారు ముందర ఎక్కువ నిడివి లో కనిపించే వాళ్ళు నటన తప్ప మిగతా అన్నిటిలో సమర్ధులు అయ్యి ఉండాలి అని.
- ఒక్క కమెడియన్ తప్ప మిగతా ఆర్టిస్ట్లు అందరు పక్క రాష్ట్రాలు వాళ్ళు అయి ఉండాలి.
- డబ్బులు పెట్టె నిర్మాత ఒక పెద్ద supplier మాత్రంగా మిగిలి ఉండాలి.
- హీరో గారి కి ఇష్టమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరిగే విధం గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
abbalu,taathala perulatho chelaamani avutunnaree tattukodukulu.vaarini aadaristtunnaari gaadidalu.
ReplyDeleteEven though entry is easy for cine descendants, now they are realizing that director, story is more prominence than star value.
ReplyDelete