రాత్రంతా నిద్ర లేదు. కరెంట్ నాలుగు అయిదు సార్లు పోయుంటుందేమో. ఈరోజు తొందరగా వెళ్ళాలి అన్న టెన్షన్ ఒకటి. ఒక్క పది నిముషాలు పడుకుందాము కళ్ళు మూసుకోపోయాను. కొంచం మగత గా నిద్ర పట్టిందేమో లేదో "ఏమండి, ఈ రోజు తొందరగా వెళ్ళాలి అన్నారు. లేస్తున్నారా" అంటూ శ్రీ మతి గొంతు వినపడింది. ఇక లాభం లేదు అను కొంటూ లేచి బాత్ రూం వైపుకు సాగాడు.
"ఏమోయ్ !! నీళ్ళు రావడం లేదు. చెప్పవా రాత్రి owner కి పొద్దున్నే వెళ్తున్నాము. మోటర్ వెయ్యడం మరవద్దు అని" గావుకేక పెట్టాను. ఉలిక్కిపడి లేచింది మా ఆవిడ. "చెప్పానండి. రావట్లేదా నీళ్ళు ?" కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్తం మీద మాట్లాడింది సతీమణి. "అబ్బా !! ఈయనతో చచ్చే చావు వచ్చింది. ఎప్పుడైనా పొద్దున్నే వెళ్ళాలి అంటే అప్పుడే ఈ పెంట పెడతాడు, ఇంట్లో ఏమైనా ఉన్నాయా నా వరకు సరిపోయేంత వరకు" కొంచం కంగారు గా అడిగాను. ఆవిడ ఆ బిందె, బకెట్ లో నించి మిగిలనవి కొన్ని అయిన వరకు సర్దింది. "ఛీ ఛీ వీళ్ళకి పక్క వాళ్ళు అంటే కొంచం విలువ కూడా లేదు" అంటూ సణుగుతూ ఏదో కాకి స్నానం కానించి బయట పడ్డాను.
సన్యాసి రావు బ్యాంకు లో ఆఫీసర్ గా ప్రమోషన్ మీద ఈ మధ్యే కాకినాడ నిండి హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అయ్యే ప్రయత్నం లో ఉన్నాడు. ఈ రోజు తన చిన్న అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కి తన దూరపు చుట్టం ఫ్రెండ్ ఈ ఏరియా కి corporator కావడంతో కొంచం recommendation కోసం బయలు దేరుదాము అని ప్లాన్. చెప్పులు వేసుకుంటూ ఉండగానే సెల్ మోగింది. "బయలు దేరరా, సుబ్బా రావు గారు చాల నిక్కచ్చి గా ఉంటాడు టైం అంటే", హడావుడి గా అన్నాడు మా బావ మరిది కజిన్ సురేష్. "ఒక్క పదిహేను నిమిషాల్లో ఉంటానండి" ఆటోలు దొరకవేమో అన్న భయాన్ని దాచుకొంటూ చెప్పాను.
ఇల్లు కొంచం మెయిన్ రోడ్ దూరం ఉండడంతో ఆటో లు దొరకడం లాటరీ కన్నా ఘోరం. నాలుగు అడుగులు వేసాడో లేదో అదృష్టం కొద్ది ఆటో సౌండ్ వినపడింది. "బాబు !! దిల్ సుఖ్ నగర్ ఆతా ?" సాధ్యమైనంత శ్రావ్యంగా అడిగాను. హైదరాబాద్ లో ఆటో వాళ్ళు అడిగే విధానం కి చాల ప్రాధాన్యం ఇస్తారు. నచ్చక పొతే అటుకేసి వెళ్తున్నా వాడు ఖాళీ గా వెళ్తాడు కాని బేరం ని ఖాతరు చెయ్యడు. "నై ఆతా" అంటూ రాజ కుమారుడు శ్వేత అశ్వాన్ని స్వారి చేసి నట్టు గా ముందరకి కదల పోయాడు. "బాబు !! కనీసం మెయిన్ రోడ్ వరకు వస్తావా" పూర్తిగా బతిమలుతున్నట్టు గానే అడిగాడు. ఏ కళ మీద ఉన్నాడో కాని "తీస్ రుపయ్యా" అన్నాడు. అయిదు నిమిషాల నడక అయినా కాని తప్పక ఎక్కాను. కడుపు మండుతున్నా ఏమీ మాట్లాడకుండా తర్వాతి ఆటో వాడిని ఎలా బుట్టలో వెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. మాములు గా మొత్తం కలిపి ముప్పై రూపాయలు అయ్యే ఆటో ఖర్చుకి డెబ్బై రూపాయలు చెల్లించి సుబ్బా రావు గారింటికి అనుకొన్న దానికన్నా అయిదు నిముషాలు లేట్ గా చేరుకొన్నాను. "ఏంటండి ఆలస్యం ? అయన కి అసలే కోపం ఎక్కువ" అంటూ సురేష్ కంగారు పెట్టాడు. "ఛీ ఛీ ఈ ఆటో వెధవలకి జనాలు అంటే కొంచం విలువ కూడా లేదు అండి. డబ్బు ఎలాగు కాజేస్తారు మళ్లీ మంచిగా కూడా మాట్లాడలేరు " అన్నాను కొంచం చిరాగ్గా. "సరే సరే !! వాళ్ళ గురుంచి తెలిసిందే కదా !! పదండి, పదండి" అంటూ పరుగు లాంటి నడక తో గేటు తీసుకొని లోపలి కి వెళ్ళాం. "బావున్నారా" అంటూ సుబ్బారావు గారి సతీమణి అనుకొంటా స్వాగతించారు మమ్మల్ని. "పర్వాలేదండి. ఈయన సన్యాసి రావు గారని మా చుట్టమండి" అంటూ పరిచయం చేసాడు. ఆవిడ నన్ను పలకరించే ముందరే "సుబ్బారావు గారు కలవ మన్నారండి" అని అసలు విషయానికి వచ్చాడు. "అవునా !! అయన ఇంతకు ముందరే మార్నింగ్ వాక్ కి వెళ్లారు అండి. కూర్చోండి అయినా" అంటూ మమ్మల్ని కూర్చోపెట్టింది.
మాకు చెప్పిన టైం కి ముఫై నిమిషాల తర్వాత సుబ్బారావు గారు నెమ్మదిగా వాళ్ళ కుక్క తో సహా వచ్చారు. "మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కమిటీ చైర్మన్ బాగా క్లోజ్ అండి. వాడు మనం వారానికి కనీసం ఒక్క సారైనా కలవసిందే" అంటూ ఇంకో పదిహేను నిమిషాల సోత్కర్ష తర్వాత "చూద్డామండి" అంటూ పస లేని భరోసా ఇచ్చాడు. పొద్దున్నే నా పని మీద బయలు దేరి వచ్చిందందుకు గాను మరో వంద రూపాయల బిల్ చెల్లించి ఇద్దరం కల్సి స్వాగత్ లో టిఫిన్ కార్యక్రమం కానిచ్చాము. "ఏంటండి !! ఈయన కి తన టైం తప్ప పక్కవాళ్ళ టైం అంటే కనీసం విలువ ఉండదా" అని గునిసాను. "పని మనది కదండీ. చూద్దాము" అంటూ సురేష్ secratariet వైపు కి తన స్కూటర్ ని మళ్ళించాడు. నేను కూడా నా బ్యాంకు కి టైం అవుతూ ఉండడంతో బస్ స్టాండ్ వైపు కి కదిలాను.
ఇవ్వాల్టి రోజుల్లో బ్యాంకు లో ఉద్యోగం అంటే కనీసం ఒక నలబై చేతులు ఉండాల్సిందే. ఓపెన్ కౌంటర్ సిస్టం వచ్చిన తర్వాత బల్ల చుట్టుతా మూగే కష్టమర్లతో వేగాలి.

"సార్ !! జాయింట్ ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి సార్. ఇవ్వాల...." అంటూ ఒక కుర్రాడు వాళ్ళ అమ్మ తో వచ్చి ఇంకా ఏదో అడగ బోయాడు. "ఎకౌంటు ఓపెనింగ్ అన్ని 11 తర్వాతే" అని పక్కకి పంపించేసాను.
"నమస్తే రావు గారు !! ఏంటి మమ్మల్ని లాగించేస్తారా ఈ రోజు అయినా" అంటూ అన్నపూర్ణ బిల్డింగ్స్ పార్టనర్ నవ్వుతూ ఎదురుగ్గా నిలబడ్డాడు. "అయ్యో !! బలే వారు సార్. మీరు చెక్స్ ఇక్కడ వదిలెయ్యండి సార్. రెండింటికి కుర్రాడిని పంపితే బుక్ లో ఎంట్రీ వేయించి పంపుతాను సార్" అని నేను నా సీట్ లో నించి లేచి మరి చెప్పాను.
"సార్ !! నా ఆన్ లైన్ ఎకౌంటు authorize చెయ్యాలి అండి. కొంచం అర్జెంటు" అని ఒక కుర్రాడు స్టైల్ గా నా ముందు నిలబడి అడిగాడు. చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు లాగా ఉన్నాడు. నాకు సెట్ అప్ చెయ్యడానికి access ఉన్నా కూడా, "ఆన్ లైన్ బ్యాంకింగ్ అంతా ఆ రైట్ సైడ్ లో నించి రెండో కౌంటర్" దగ్గర అని తల ఎత్తకుండానే చెప్పాను. "మరి ఇక్కడ కూడా అని అన్నారండి" అని ఏదో చెప్పుతున్నాడు ఆ కుర్రాడు. నేను మళ్లీ ఆ అబ్బాయి వంక చూడ కుండా నా పని లో మునిగి పోయాను. ఇంతలో మా బ్రాంచ్ మేనేజర్ లోపలి రమ్మని ఇంటర్ కం లో ఫోన్ చేసి చెప్పాడు. ప్రీమిఎర్ కస్టమర్ లతో ఒక గంట గడిపిన తర్వాత బయటకు వస్తుంటే ఇందాక ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి అన్న కుర్రాడు మళ్లీ ఎదురు పడ్డాడు. "సార్ !! మా పని పూర్తి చెయ్యండి సార్" అంటూ. అతని కాగితాలు చూస్తూ, "అందేంటి బాబు. మీ అమ్మది ID proof తీసుకు రాలేదు ఏంటి". "నిన్న ఓన్లీ primary account holder ది ఉంటె చాలు అన్నారు సార్, ఆ కౌంటర్ లో ఉన్న అయన. సార్ కొంచం హెల్ప్ చెయ్యండి సార్" బతిమాలుకొన్నాడు ఆ కుర్రాడు. "కుదరదమ్మా !! రేపు వచ్చినప్పుడు అన్ని తీసుకు వచ్చేయి" అని adjust చేసి పని అయిపోగోట్టే ఛాన్స్ ఉన్నా దాటేసాను. వాళ్ళ అమ్మ తో కొంచం జాలి గా అక్కడ నించి కదిలాడు ఆ కుర్రాడు. మిగత పని సందడి లో పడి లంచ్ టైం అన్న విషయం కూడా మర్చి పొయ్యాను. మరి ప్రపంచంలో జనం అందరికి డబ్బు తోనే నిత్య కళ్యాణం కదా, ఇండియా లో బ్యాంకు లు ఎన్ని పెట్టినా కిట కిట లాడుతునే ఉంటాయి. లంచ్ కానీ లేవ పోతూ ఉంటే కొంచం పెద్దాయన "అయ్యా !! కొంచం DD తెలియక తప్పు అడ్రస్ కి తీసుకొన్నాను. దీన్ని కాన్సిల్ చేసి మళ్లీ తీసుకోవాలి అండీ. అయన ఏమో మీ అప్రూవల్ ఉండాలి అంటున్నారు. చూస్తారా" అని అడిగాడు. "ఇది పర్సనల్ బ్యాంకింగ్ మేనేజర్ గారు చూడాలి అండీ. రేపు రావాలి మీరు. అయన ఈ రోజు లీవ్ లో ఉన్నారు" దాటేసాను. కొంచం గొనుక్కుంటూ అయన అక్కడ నించి వెళ్ళాడు. అసలే పొద్దున్న నించి చిరాగ్గా ఉన్నానేమో నా పనులే కాక మళ్లీ పక్కవాళ్ళ పనులు చేసే ఓపిక అస్సలు లేదు.
ఆఫీసు నించి సుమారు ఆరు ఇంటి సమయం లో బయట పడి ఇంక ఓపిక లేక ఆటో లో ఇంటికి బయలు దేరాను. వచ్చిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో తొందరగా BP పెరగకుడా ఉండాలి అంటే ఆటో వాళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న ధర్మ సుక్ష్మం తెలుసు కొన్నాను. మెయిన్ రోడ్ లోనే దిగి
కొంచం నడిచి ఊసురూ మంటూ ఇంటికి చేరాను. గేటు దగ్గర మా ఓనర్ కనపడితే, "బావున్నారా సార్ !! సార్ పొద్దున్నే నీళ్ళకి కొంచం కష్టం అవుతోంది అండీ. రాత్రిళ్ళు మోటర్ వెయ్యడం మర్చి పోవడం మర్చి పోకుండా ఉంటారా" అంటూ వీలు అయినంత నెమ్మదిగా చెప్పాను. దానికే అయన మొహం మాడ్చుకొని, "ఇప్పటికి మూడు సార్లు చెప్పారు అండీ మీ మిస్సేస్స్ గారు. మళ్లీ మీరు చెపుతున్నారు ఇప్పుడు" అంటూ స్కూటర్ లో అక్కడ నించి కదిలి వెళ్ళిపోయారు.
"ఛ ఛ !! ఎం మనుషులో ఏంటో !! పక్కవాడికి కనీసం విలువ కూడా ఉండదు" అనుకొంటూ లోపలికి చేరాను. ఈ సారి ఒక నిండు బకెట్ నీళ్ళతో స్నానం చేసి భోజనం చేస్తూ ఉంటే, "ఏమండి !! దొరికిన్దనుకొన్న పని మనిషి లాస్ట్ లో రానని చెప్పింది. కధ మళ్లీ మొదలుకి వచ్చింది. మళ్లీ వెతుకు లాట మొదలు పెట్టాలి" అనింది నా సతీమణి.
"ఏమండి !! కాకినాడ నించి transport వాళ్ళు పోగొట్టిన మన కుర్చీలు మరియు బీరువా తాలూకు డబ్బులు ఇవ్వడం కుదరదు అట. కావాలి అంటే వాళ్ళ కోచిన్ లో ఉన్న హెడ్ ఆఫీసు కి కంప్లెయిన్ చేసుకో మన్నారు", అంటూ బాడ్ న్యూస్ ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టింది మా ఆవిడ.
"అబ్బా !! ఈ దేశం లో కష్ట పడకుండా అసలు ఒక్క పని అయినా అవడం నా ఈ జన్మ లో చూస్తానా. ఎవడి పనులు వాడు సక్రమంగా పని చేస్తే జనం కి ఇన్ని కష్టాలు ఉంటాయా. అయినా వీళ్ళని అని లాభం లేదు, యధా రాజ తధా ప్రజా !! వాళ్ళే అలా ఉంటే మిగతా జనాలు ఏమి చేస్తారు" అని ఒక చిన్న సైజు lecture మా ఆవిడ కి దంచి ఇంక బాగా నిద్ర రావడం తో పడుకోవడానికి మంచం మీద వాలా. కొంచం నిద్ర పడుతోంది అన్న సమయం లో పొద్దున్న బ్యాంకు లో వాళ్ళ అమ్మ తో సహా నిలపడ్డ ఎకౌంటు ఓపెన్ చెయ్యడానికి వచ్చిన కుర్రాడు మరియు DD మార్పించడానికి వచ్చిన పెద్దాయన సడన్ గా నా కళ్ళ ముందర కన పడ్డారు. ఇబ్బంది కరమైన ఆలోచనలు పక్కకి తోసేసి పడుకోడానికి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టా.

మీరు ఒక్క MLA తో వేల్లివుంటే పనులన్నీ చక చక జరిగి పోయేవి
ReplyDelete