- దేశం చలి కన్నా ధర్నాలు, బంద్ లు, దీక్షలు గురించి ఎక్కువగా వణుకుతోంది.
- విజయవాడ సరిహద్దుల్లో ఉన్న థెర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇంకా "నార్ల తాతారావు" గారి పేరు మీదే ఉంది. ఇంకా ఎవరి కంటా పడినట్టు లేదు.
- "ఆరంజ్" సిన్మా లో నటించిన వాళ్ళ పేర్లు కంటే పోస్టర్ సమర్పించిన వాళ్ళ పేర్లు బాగా పెద్దగా కనపడుతున్నాయి. విజయవాడ లో సిన్మా పోస్టర్స్ సమర్పించడానికి కూడా చాల పోటీ ఉన్నట్టు ఉంది.
- బస్సుల్లో, ట్రైన్స్ లో జనాలు ఇదివరకు లో లాగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడం బదులు సెల్ ఫోన్ సంగీతం మత్తు లో తేలియాడుతున్నారు. హెడ్ ఫోన్స్ షేర్ కాన్సెప్ట్ చాల బావుంది.
- షాపింగ్ మాల్స్ లోపలి వెళ్ళే మగ వాళ్లకి సెక్యూరిటీ చెక్ తప్పదు. ఆడ వాళ్ళు బాంబులు తీసుకెళ్ళినా అడిగే వాడు లేడు
- చంద్ర బాబు ఆ మధ్య దేశం లో మరుగు దొడ్లు లేక పోయినా జనం బతుకు తారు కాని, సెల్ ఫోన్ లో లేకుండా ఒక్క క్షణం కూడా ఉండ లేరు అన్నది అక్షర సత్యం. తుమ్మిన వెంటనే ఎవరికీ అయినా చెప్పకుండా ఉండలేక పోతున్నారు.
- అమెరికా నించి ఎవరు అయిన కనపడితే, మీరు నికృష్టం మైన జీవితం గడుపు తున్నారు అని చాల మంది పని కట్టుకు చెప్పడం ఈ మధ్య ఆనవాయితి అయినట్టుంది.
- దేశం లోని తొంబై శాతం వనరులు జనాభా లోని ఐదు నిండి పది శాతం ధనికులు వాడుతున్నారు. ఇంకా మంచి నీరు కూడా లేని ప్రజలు కో కొల్లలు.
- హైదరాబాద్ లో ఇళ్లన్నీ ఇంద్ర భవనంలు - రోడ్లు అన్ని నరక కూపాలు
- కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రి వర్గ కూటమి ఎర్పడినాడు విజయవాడ నగరం అంతా నిద్ర హారాలు మని పేపర్లతోనే సంభాశించింది.
- ప్రజలు అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే క్రమంలో ఇరవైనాలుగు గంటలు హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూనే ఉన్నారు.
- దేశంలో "భక్తీ", "టి టి డి" చానల్స్ పుణ్యమా అని పదమూడు, పన్నెండు శతభ్డాలు లో జరిగినట్టు "భక్తీ" ఉద్యమం జరుగుతున్నది.
- పెళ్లి శుభ లేఖలలో "పెద్దలు నిర్ణయించిన సుముహూర్తం గాన విచ్చేసి వధూ వరులను ఆశీర్వచ వలసినది" అనే బదులుగా "రిసెప్షన్ కి వచ్చి మా విందు (ఒక్కొక్క ప్లేటు ఎన్ని రూపాయలో కూడా చెప్పవచ్చు) ఆరగించి, ట్రాఫ్ఫిక్ ఇబ్బందులు కాన త్వరగా వెళ్ళిపొండి" అని కూడా అచ్చు వెయ వచ్చు.
- ప్రవాసాంధ్రులు అంటే విపరీతమైన సానుభూతి పెరిగింది.
Monday, January 10, 2011
దేశం - నా కళ్ళతో
Subscribe to:
Post Comments (Atom)
15. NRI's చాల విషయాలు బ్లాగ్స్ ద్వార చర్చించుకుంటున్నారు
ReplyDeleteఇదే modernization ఏమో
ReplyDelete