Saturday, August 31, 2013

ఈ రోజు ముక్ష్యాంశాలు

 "హైదరాబాద్ లో ఉన్న వారంతా తెలంగాణ వారే" -  దామోదర  (జ్యోతి)
"హైదరాబాద్ అందరిది" - తెదేపా ఎమెల్యే లు (ఈనాడు)
"ఇంకా వెయ్యి ఏళ్ళు అయినా హైదరాబాద్ సీమంధ్ర వాళ్ళది అవదు" - హరీష్(జ్యోతి)
"హైదరాబాద్ లో సభ జరిపే హక్కు సీమాంధ్రులకు లేదు" - నాగం (జ్యోతి)
"రాజ్యాంగ బద్దం గా ఎవరు అయినా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు" - డి ఎస్ (జ్యోతి)
"సీమాంధ్ర వాదనలో న్యాయం ఉంది" - చంద్రబాబు (ఈనాడు)
 "తెలంగాణ రాష్ట్రం ఆపే శక్తి ఎవరికీ లేదు" - మధు యాష్కి(జ్యోతి)
 "తెలంగాణ ప్రక్రియ ని వేగవంతం చేయాలి" ఉద్యమ నిర్మాత నాయకులు (ఈనాడు)
"తెలంగాణ ని విభజించి ప్రభుత్వం తప్పు చేసింది"  మధు సూధన్ గుప్తా (సాక్షి)
"తల మొండెం వేరు చేయద్దు" - సచివాలయ ఉద్యోగులు (ఈనాడు)
"విభజిస్తే సీమంద్రకారం" - ఎవరో (సాక్షి)
"ముఖ్య మంత్రిది  అవకాశవాదం" - కోదండ రామ్ (ఈనాడు)
"జగన్ నిరాహార దీక్ష ఎందుకు ఎవరి కోసం" - మోత్కుపల్లి (జ్యోతి)
"ఏడు రోజుల దీక్షతో నీరశించిన జగన్" - నిమ్స్ వైద్యులు (సాక్షి)
"దీక్షలు బగ్నం చేసినా ప్రజల మధ్యనే ఉంటాం" - విజయమ్మ (సాక్షి)
"యాత్ర ఎందుకో చెప్పండి" - ఎ పీ ఎన్ జి ఓ సంఘం అద్యక్షుడు (ఈనాడు)

మాకు  స్కూల్ ఫంక్షన్ లో వార్తలు ని పేరడీ చేసి చదివే ప్రోగ్రాం ఒకటి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు అవి ప్రత్యేకం గా అక్కరలేదు అనుకొంటా. తెలుగు వాడికి విస్తర్లో అమ్మ (తెలంగాణ తల్లి అయినా, తెలుగు తల్లి అయినా) అన్నీ పెట్టినా, అవకాయో లేక గొంగురో లేదు అని అక్షేపిస్తాడు అట. తెలుగు పేపర్లలో, టీవీ ల్లో గత నాలుగు సంవత్సరాల నించి రకరకాల పచ్చడ్ల పండగే. కాకా పొతే తిని తిని (విని చదవి) కడుపు నెప్పి ఎక్కువ అయినట్టు ఉన్ది.





Sunday, August 11, 2013

ధర్మాచరణ

మనం ఇది చాల సందర్భాల్లో వింటూ ఉంటాము. యుద్ధం లో సైనికుడు ఒక శత్రువుని మరియు ఒక పచ్చి ఉన్మాది మానవత్వం ఊహించని విధంగా అన్నెం పున్నెం తెలియని అమాయకులని చంపడాన్ని రెండింటిని "హత్య" అని అనడం లెదు. మొదటిది కర్తవ్యమ్ అయ్యి ఆ దేశ ప్రజలచే కొనియాడ బడితే రెండో దాన్ని అత్యంత హేయమైన కిరాతకం గా చిత్రీకరించ బడుతుంది. ఒకటి వృత్తి ధర్మం అయితే రెండవది అధర్మం అంటున్నారు.

రామాయణం లోని అరణ్య కాండ లో శ్రీ రాముడు భరద్వాజ ఆశ్రమం లో సీతా లక్ష్మణ సహేతుడై ముని ని తన ఆశ్రమ నిర్మాణానికి ఒక అనువైన ప్రదేశం సూచించ మని అడుగుతాడు. ఆయనే శ్రీ మహా విష్ణుడిగా గుర్తు ఎరిగిన మహర్షి రాముడిని అక్కడే అరణ్యవాసం చేయమని కోరతాడు. దానికి శ్రీ రామ చంద్రుడు, సున్నితంగా నిరాకరిస్తూ తన ధర్మం ఋషులతో గడపడానికి సమ్మతించదని చెప్పి నిరాకరిస్తాడు. పైగా ఒక ఉదాహరణ చెపుతూ మీ ఆశ్రమం లో ఉండే సాదు జంతువులని క్రూర మృగాల నించి రక్షించే క్రమం లో నేను వాటిని సంహరించి నప్పుడు, మీ మనస్సులు ఏ  సందర్భం లో అయినా కష్టం కలిగి నాకు అకారణ శాపంనకు కూడా కారణం అవచ్చు అని చెపుతాడు. నిజంగానే అన్ని భూతాల్లో ఒకే పర బ్రహ్మం ని దర్శించే స్తాయి మహర్షికి ఉందని అదే ధర్మాన్ని దుష్ట శిక్షణ నిమిత్తమై వచ్చిన రాముడు పాటిస్తే అవతార ప్రయోజనం నేరవేర్చేది ఎలా?

సహజం గా మనం పాటించే ధర్మం మీద మన అందరికి రాగం మరియు నచ్చని దాని మీద ద్వేషం కలగడం చాల సందర్భాల్లో చూస్తూ ఉంటాము.మత సంప్రదాయాల్లో పాటింపులు మరియు  పట్టింపులు వల్ల ఒకడిని ఒకడు కొన్ని వేల సంవత్సరాలు పాటు ద్వేషిస్తూనే ఉండటం దాని వల్ల చరిత్ర లో అతి దారుణమైన యుద్దాలు... అయితే ఇక్కడ ధర్మ పరిశీలన చేయడం అందరికి సాధ్యమా? ఎందుకు అంటే మనలాంటి వాళ్లకి స్వతహా గా అత్యంత ఇష్టం అయిన పని "తప్పోప్పుల నిర్ధారణ" మరియు తీర్పు. పక్కవాడిని ధర్మ బ్రష్టుడు అని వెలి వేయడం లేదా పరమ ధర్మాత్ముడు అని భజన చేయడం చాలా సార్లు చూస్తూ ఉంటాము. మరి అందరికి ధర్మ పరిశీలన చేయడం కుదురుతుందా?

ఎందుకు అంటే ధర్మం దేశ కాల పరిస్తితుల బట్టి మారుతూ ఉండచ్చు. లేదా మనకి కనిపించే ధర్మం అధర్మం అయ్యి ఉండవచ్చు.   చాల తక్కువ సందర్భాలో అందరికి ఆమోద యోగ్యమైన ధర్మాచరణ బయటకి కూడా ధర్మంగానే కనిపిస్తుంది. మదర్ తెరిస్సా తనకి ముక్కు మొహం తెలియని వాళ్లకి వచ్చి ఏ మాత్రం స్వార్ధం లేకుండా తన జీవిత కాలం సేవ చేసినది. విశ్వా మిత్రుడు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన "గాయత్రీ" మహా మంత్రాన్ని మానవాళి బుద్ది సక్రమం గా ప్రచోదనం చేసికొనే అవకాశాన్ని కలిగించి ఈ విశ్వానికి "మిత్రుడు" అయ్యాడు.ఇక్కడ ధర్మంని ధర్మం గానే దర్శించ వచ్చు.

కొన్ని సందర్భాల్లో ధర్మం సామాన్య ప్రజలకి అధర్మం గా కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీ షిర్డీ సాయిబాబా హైందవ సనాతన ధర్మం లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా వైదిక సంస్కృతి కి కట్టుబడి ప్రవర్తించినట్టు గా దాకలాలు లెవు. అనగా అయన ఈ కట్టుబాట్లకు అతీతుడు. అదే విధంగా శ్రీ కృష్ణుని బాల్యం లో అంతా చోర లీలలు గురించి భాగవతం లో చూస్తే, మన లాంటి వాళ్ళు అనుకరణ సాధ్యం కాని విధంగా ఉంటుంది. అనగా జ్ఞాని ని అనుకరిస్తే సామాన్యుల విషయంలో అది అధర్మంగా పరిగణింప పడుతుంది.

ఇంకొన్ని సార్లు, అధర్మ ప్రవర్తన బయటి ప్రపంచానికి ఉత్తమ మైన ధర్మం గా కనపడే అవకాశం ఉంది. మనం చాల మంది దొంగ సన్యాశులను చూస్తూ ఉంటాం. బయట ఎన్నో ధర్మ పన్నాలు చెపుతున్నా, అంతర్ముఖంలో బహు కుతంత్రాలు కుటిల నీతులు మాయం తో వారి జీవన పయనం ఉంటుంది. వీళ్ళతో చాల ప్రమాదం సమాజానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక పొతే అధర్మ ప్రవర్తన ఉండే అధర్మ పరులు గుర్తించడం కొంచం సులభమే అనుకొంటా.

మరి ధర్మ పరిశీలన ఇంత సంక్లిష్టం అయినప్పుడు తప్పొప్పులను ఎంచడం మన లాంటి వాళ్లకు సాధ్యమా? అలాగే జీవిత పర్యంతం తన ధర్మాన్ని ఎరిగి ఆచరణ చేయడం అంత సులభమైన విషయమా? మనం చాల మంది అంటూ ఉండడం చూస్తూ ఉంటాము. నాకు నా పరిధి లో నేను సక్రమం గా ఉంటె సరి పోదా అని. నిజంగా మనం అంత వరకు ఎటువంటి అంతర్మధన కు గురి కాకుండా సక్రమం గా విధి నిర్వహణ చేయ గలమా? ఎందుకు మన ధర్మం మన జీవన స్తితి ని బట్టి మరూతూ ఉంటుంది కదా. కొడుకు గా, తమ్ముడిగా, అన్నయ్య, భర్త గా, చెల్లెలు, అక్క, తల్లి, తండ్రి, స్నేహితుడు, పరిచయస్తుడు ఇట్లా రక రకాల స్తాయిల్లో రక రకాలు గా.

ఉదాహరణకి, యుధిస్టరుడు మొత్తం భారతం సర్వ పాత్రల్లో ధర్మానికి ప్రతీకగా చెపుతారు కదా. అయన ఎంత ధర్మానికి కట్టుబడ్డాడు అంటే, అజ్ఞాత వాశం ఉత్తర గోగ్రహణం లో అర్జనుడు బయటపడి పోయినప్పుడు, పాండవులు నిజం గా గడువు సక్రమం గా పూర్తి చేసారా లేదా అన్న మీమాంశ వస్తుంది. సరే యుద్ద భూమిలో ద్రోణ, భీష్మ మాటలు వినక తప్పక యుద్ధం కొనశాగించి అర్జనుని చేతిలో అవమానిమ్పబడిన కౌరవ రాజు కు భీష్మ పాండవ పక్షపాతి అని అనుమానం వీడక ఒక వేగు ని పిలిచి "ధర్మ రాజుని" ఈ సమస్య పై నివృత్తి ని కోరమని అడుగుతాడు. అంటే ధర్మ రాజు నిజం గా గడువు పూర్తి అయ్యింది అంటే, దుర్యోధనుడు ఇంక పై దాని గురుంచి ఆలోచించడు.అటువంటి ధర్మ వేత్త మరి భార్య ని అధర్మంగా పందెం లో ఒడ్డాడే అని మనకి అనిపించక మానదు. ధర్మ రాజు తాను ఓడాక భార్య ఒడ్దే అధికారం ఉంటుందా? అసలు భార్య ను పందెంలో ఒడ్డే అధికారం భర్త కి ఉంటుందా? కాని ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మ రాజు అసలు తన్ను పందెంలో ఒడ్దే అవకాశమే లేదు అని పూర్తి గా నమ్మి నేను "ధర్మ" విజితనా లేక "అధర్మ" విజిత నా అని సభని ప్రశ్నిస్తుంది. తెలిసినా చెప్పితే కురు వంశం ఏమి అవుతుందో అని  భయ పడ్డ భీష్ముడు ఆ ప్రశ్న దాటి వేస్తాడు. వివరించిన వికర్ణుడిని స్తాయి లేదని కర్ణుడు నిలువరిస్తాడు. అసలు సర్వ స్వతంత్రుడై జూదం ఆడుతున్న ధర్మ రాజు ద్రౌపది ని పందెంలో పణంగా పెట్టనే లెదు. తన అధీనంలో ఉన్న రాజ్యాలని, సంపదని, తమ్ముళ్ళని చివరకి తన్ని పందెంలో ఒడ్డి కౌరవ రాజు అయిన దుర్యోధనునకు బానిస అవుతాడు. అప్పటి వరకు దుర్యోధనుని ప్రతినిధిగా జూదం ఆడుతున్న శకుని ఆజ్ఞ మేరకు ద్రౌపది ని చివరగా పందెం లో ఒడ్డుతాడు. ఆ సమయంలో శకుని ద్రౌపది నే కాదు మరి ఎవరి ని పందెంలో ఒడ్డమన్నా అతను ఆజ్ఞ పాలించవలసిందే. అతంక ముందు వరకు ధర్మ రాజు "రాజ" ధర్మం వహిస్తే ఆ తర్వాత "సేవక" ధర్మం పాటించాడు. సేవకుడి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు అందులో సాధ్యాసాధ్యాలు చూసికొనే బాధ్యత యజమానిదె. ఒకవేళ తన్ని పందెంలో ఒడ్డే ముందర కనక ద్రౌపది ని ఒడ్డ మని శకుని సలహా ఇచ్చి అయన అది చేస్తే అప్పుడు ధర్మ రాజు అధర్మ పరుడో కాదో నిర్ణయించే అధికారం మనకి ఉండచ్చు.

మరి ఈ కత్తి మీద సాము లాంటి ధర్మాచరణ అందరికి సాధ్యమా? తన ధర్మాన్ని తను నిర్వత్తిస్తే భగవంతుడు హర్షిస్తాడా? స్వధర్మాన్ని పాలించే వాళ్ళకి సత్య దర్శనం కలిగి శోకం తొలుగు తుందా?  ఇదే ధర్మ రాజు యుద్ధం అయిన జరిగిన జన నష్టం ని చూసి విపరీతమైన శోకానికి గురి అవుతాడు. కాగ నిత్యం ధర్మ పరాయణుడైన అయన ఆ విధం గా శోకించడం చూడ లేక "కిమేకం దైవతం కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కం కమర్చంతః ప్రాప్ను యుర్నామానవా శుభం" అని భీష్ముడిని అడిగేలా చేసి అయన కి విష్ణు సహస్ర నామ స్త్రోత్ర సారము తద్వారా సత్య సందర్శనం కలిగేలా చేస్తాడు ఆ భగవానుడు.

మన స్వధర్మం మనం పాటించినప్పుడు, సంఘర్షణలు ఎదురు అయినా, దానిలో తప్పు ఒప్పులు ఆయనకే సమర్పించ గలిగి నప్పుడు ఆయనే భాద్యత వహించి మన్ని తరింప చేయ గలడు అన్నది ఇక్కడ మనకి అర్ధం అవుతుంది.

*** కొంత మంది మహాను భావులు చెప్పిన ఒకటి అరా మంచి మాటల సారాన్ని అక్కడ ఇక్కడ జోడించి రాసిన వ్యాక్యాలు ఇవి. అంతే కాని నేను ఇంత గంభీర మైన విషయాలు గురించి వ్రాసేంత ప్రాజ్ఞుడిని కాదు మరియు అర్హుడిని అంత కన్నా కానే కాదు.

Wednesday, December 19, 2012

ఏది నాది

రావు గారు మొత్తం జిల్లాలోకే  పేరుమోసిన మోతుబరి. స్వతహా గా దక్షత కలవాడు అవటం చేత వారసత్వంగా వచ్చిన దాన్ని పోషణ, పెంపకం తో పాటు ఇతరత్రా దాదాపు దేశం అంతా వ్యాపార కేంద్రాలు నెలకొన్నాయి. వ్యవహారానికి సొంత ఊరు "కొంత" అయిపోవడంతో, ఎంతో ఇష్టం అయిన ఇంటిని మరియు ఊళ్ళో ఉన్న పొలాలని  పినతండ్రి అల్లుడు, భూపతి దగ్గర వాడు అవడంతో బాటు పదిలం గా చూసికొంటాడు అన్న నమ్మకంతో అప్పచెప్పి పై రాష్ట్రం కి భార్య పిల్లలు తో వెళ్ళాడు. సహజం గా వ్యాపారం లో అందే వేసిన చెయ్యి అవడంతో రాణింపు కి ఏమి దొక లేకుండానే ఇంతింతై వటుడింతై అన్నట్టు గా కొద్దికాలం లోనే పేరు, హోదా, పరపతి అయన పరం అయ్యాయి. ఊరికి కొత్తలో చాల సార్లు, నెమ్మదిగా కొన్ని సార్లు, తర్వాత తప్పదంటే వచ్చే వాడు. పిల్లలు కూడా కొత్త ప్రదేశంలో అలవాటు అయిపోవడంతో,రాకపోకలు పూర్తి గా తగ్గాయి.


భూపతి కొత్తల్లో ఉత్త పుణ్యానికి మంచి హంగు ఉన్న ఇల్లులో ఉండనిచ్చి నందుకు ఎంతో కృతజ్ఞత తో ఉంటూ తర్వాత పెద్దగ పొలం లెక్కలు కూడా చెప్పనవాసం లేక పోవడం తో , నెమ్మది నెమ్మది గా కలిసి వచ్చిన ఆశ్వర్యం కి బాగానే అలవాటు పడ్డాడు. మొదట్లో మాటల  సందర్భంలో, "నాదేముంది అండీ !! అంతా రావు గారి దయ" నించి కొన్నాళ్ళు అయిన తర్వాత అయన ఉనికి తగ్గడం తో ఇదంతా తన ప్రయోజనమే అన్న మిడిసిపాటుకి అలవాటు పడ్డాడు. అందరికి తన యొక్క వైభవం అర్ధం అయ్యే "లాగా" తర్వాత "వరకు" విశీదీకరించే వకాల్త పుచ్చు కొని చాల వరకు సఫలీకృతుడు కూడా అయ్యాడు. కొన్ని ఏళ్ళు ఇట్లానే గడిచిన తర్వాత ఒక నాడు రావు గారు రావడం, విషయం అర్ధం అవ్వడం జరిగాయి. వెంటనే దేశానికే ప్రముఖుల్లో ఒక్కడైన అయన భూపతి రోడ్డు పాలు చేయడానికి పెద్ద సమయం పట్టలేదు అని చెప్పనక్కర్లేకుండా జరిగి పోయింది.


ఇది చాల మామూలు కధ లాగానే ఉంది కదా, దీన్ని గురించి ఇంత కష్ట పడ్డాడు అని ఆశ్చర్య పడుతున్నారా? కొంచం అలోచించి చూడండి, ఇది మన అందరి కథ లాగ అనిపించడం లేదండీ? మనం ఏదీ అడగకుండానే మొత్తం సృష్టి మొత్తం ప్రకృష్టమైన శరీరం అనే ఇల్లు ఇచ్చి దానికి తోడు మాట, ఆలోచన అనే ఆస్తులు కూడా  జోడించిన తర్వాత ఆ పరమాత్మ ఎప్పుడైనా మన నించి ఏమీ ఆశించకుండా ప్రేక్షకుడి గానే మిగిలి ఉంటున్నాడు. అయితే ఈ ప్రపంచం ని "నా" అద్దం లోంచి చూస్తూ చివరికి ఇదంతా నా ప్రయోజకత్వమే అన్న భావజాలం నించి చివర వరకు బయటకు రాలేక పోతూ అంతా నాది అంటూనే చివరకి ఏమీ మిగలకుండా ఈ శరీరం లోంచి బయటకు నెట్టివేయ బడుతుంటాం. ఈ విషయమై రామాయణ అంతర్గతంగా ఒక ప్రస్తావన ఉంటుంది.

అరణ్య కాండ లో భరతుడు, రాములి వారిని తిరిగి  అయోధ్య కి రమ్మని శత విధాలు గా ప్రాధేయ పడతాడు. చుట్టూ వున్న మంత్రులు, పరివారం చివరకి  కైక కూడా ఆయన్ని బ్రతిమాలిన కూడా, పితృవాక్య పరిపాలనకి బద్దుడైన కారణానికి, రాముడు తిరిగి అయోధ్యకి రాలేడు అన్న నిర్ణయం నిర్ధారణ అవుతుంది. దేశం రాజ హీనం అవ్వకూడదు అన్న కారణానికి, వన వాసం గడువు పూర్తి అయ్యే వరకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అక్కడే ఉన్న మంత్రి ఒక ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు భరతుడు ఒక్క సారిగా ఏదో దొంగతనం జరిగి తున్నట్టుగా ఉలిక్కి పడతాడు అట. "నాది" కాని దాన్ని ఈ విధంగా అనుభవించమని చెపుతారు ఆ మంత్రి గణాన్ని ప్రశ్నించడం జరుగుతుందని వ్యాఖ్యానం. చివరకి "రాముని" ప్రతినిధి గా రాజ్యం ఏలుతాను అని ఒప్పుకొని అయన "పాదుకలు" కి పట్టాభిషేకం జరుపుతాడు.

భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుత శరీరాన్ని ఒక పరికరంగా భావిస్తూ ఈ ప్రాపంచిక భోగాలని అనుభవిస్తూనే, నిత్యం ఈ నాది కాని  దాన్ని "సాక్షి భూతం" గానే చూడమని ప్రాజ్ఞులు హెచ్చరించారు. ఎవరో నూటికో కోటికో ఒకటి అర ఈ సత్యాన్ని తెలుసు కొని తరించారనుకొంటా. అంతెందుకు అండీ ఇప్పడి వరకు వ్రాసింది కూడా "నా" ప్రజ్ఞే అని తలచుకోవడం లోనే తెలుస్తోంది, మనం ఏ పాటి బొంట్లమో అని.

Friday, March 23, 2012

యుగాది

In the universe that we are in, you can witness everything has a begining, growth and decay. In Sanatana Dharma, all devine virtues are associated as per natural order of the universe. The nature is in pause state during the winter and springs back into action at the begining of Chaitra Masam. Yuga + Aadi means "begining of new era". The pournami (Full Moon) that occurs in the month of Phalguna Masam is called "Kamuni Punnami" (HOLI) in telugu regional dialect. And Amavasya thats followed is (No Moon) called "Soonya Amavasya". Is there any mythological signicance for this? While, TarakaSura, the cruel demon was troubling all worlds with his atrocities, all sane people were waiting for the son of Shiva & Parvati. As they know,only Lord Subramanyeswara can put an end to this siffering and they encourage Manmadha to invoke Love between Lord and Lordess. (On the day of Kamuni Punnama). As Lord Shiva gets angry and turn Manmadha into ashes, there is no "Want" left in the universe and everything became absolute stand still for next 15 years in the Lord Brahma calendar. Again, with absolote love and kindness towards entire universe, Lord orders Brahma to resume creation (Srushti) on this auspicious day of UGADI. Lets welcome ShobhaKrit year with anticipation of new begining. సృష్టి లో అన్ని మొదలవుతాయి, వృద్ది చెందుతాయి, అలాగే అంతం అవుతాయి. హిందూ సంప్రదాయం లో  ఇదే క్రమాన్ని దృష్టి లో మన దేవతా స్వరూపాలని కూడా నిర్వచించారు.  అందరికి తెలిసిందే, చైత్రం లో అప్పటి వరకు నిద్రాణమైన ప్రకృతి మేల్కొని  తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఉద్యుక్తమవుతుంది. ఇది మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. మరల ఇదే రోజు ఒక కొత్త యుగాన్ని సృష్టి కర్త అయిన బ్రహ్మ ప్రారంభించాడు కావున ఈ రోజుని యుగ ఆది గా మనం అందరం పండగ చేసికొంటున్నాము

అయితే ఇదే సందర్భంలో, మన ఆంధ్ర దేశం లో కొన్ని వాడుకలో ఉన్న  పదాలు గురించి కొంత మేరకు విశ్లేషణ చేస్తే కొన్ని పురాణ సంభంధం అయిన చిక్కు ముడులు వీడతాయి. ఉగాది ఒక పక్షం ముందర వచ్చే పౌర్ణమి ని "కాముని పున్నమ"(హోలీ పండగ ) అంటున్నాం. అలాగే యుగాది ముందర వచ్చే ఫాల్గుణ కృష్ణ అమావాస్య ని "శూన్య అమావాస్య" అంటాం. దీనికి వెనక ఏమైనా పరమార్ధం ఉందా అని ప్రశ్నవేస్తే ఉందనే చెప్పాలి.

తారకాశురుడు వర బలం తో విజ్రుంభన  చేస్తూ సర్వ లోకాలని తల్లడిల్ల చేస్తున్నఅప్పుడు వాడిని చంప గలవాడు సాక్షాత్తు శివుని కుమారుడే అవటం తో దేవతా గానం అంతా సుబ్రమణ్య జననం కోసరం నిరీక్షిస్తూ ఉంటారు. అయితే అది దంఫతులు అయిన ఆ పార్వతి పరమేశ్వరులు నిరంతరం ధ్యానం లో నిమగ్నం అయి ఉండడంతో, వారి మన్మధుడిని ప్రేరేపించి శివుని లో కామ ప్రచోదనం కొరకు కార్య సిద్ది ని నెరవేర్చు కొందామని ప్రణాళిక రచిస్తారు.అది మన్మధుని యొక్క వైభవం కీర్తించ బడిన రోజు కావున ఆ యొక్క రోజు "కాముని పున్నమ" గా ప్రసిద్ది చెందపడింది.

కాగ పరమ శివుని కోపాగ్ని గురి అయ్యి మన్మధుడు దగ్ధం అవబడుతాడు. అయితే పరం శివుని మూడవ కన్ను తెరవడం తో ఒక్క మన్మధుడు ఒక్కడే నశించ బడ్డాడ లేక సకల లోకాలు నిర్జించ బడినట్టా ? నిజానికి  కామమునకు అనగా కోర్కె కు కారణం అయిన మన్మధుడు నశించడం తో సృష్టి అంతటా నిస్తేజం  అనగా శూన్యం నెలకొంది. ఈ విధంగా ఒక పదిహైను బ్రహ్మ సంవత్సరాలు గడిచి పోయాయి. కాముని పున్నమ తర్వాత వచ్చే అమావాశ్య ని "శూన్య అమావాశ్య" గా పేర్కొన పడుతోంది.

దయా సముద్రుడైన ఆ పరమేశ్వరుడిని మరల సృష్టి ని సృజించడానికి శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మ ప్రేరేపించడంతో, అయన ఆదేశంతో మరల బ్రహ్మ సరి కొత్త యుగానికి ఆద్యం నేలకోలుపుతాడు. ఇన్ని రహస్యాలని సమీకరించ బడిన ఈ యొక్క రోజుని మనమందరం ఒక కొత్త దనాన్ని ఆహ్వానిస్తూ, ఆశిస్తూ ఈ పండగని జరుపు కోవడం జరుగుతుంది.

Monday, November 7, 2011

కృష్ణం వందే జగద్గురుం


కొన్ని విషయాలని యధాలాపం గా చదువుతాం, వింటాం, అర్ధం చేసికొంటాం. అకస్మాత్తుగా మన పక్కన ఉన్న పిల్లవాడో లేక స్నేహితుడో మనం చదివిన లేదా విన్న విషయంపై ఒక ప్రశ్న వేస్తాడు. "అరేరే !! మనకి ఈ విషయం ఎందుకు తట్టలేదురా" అనుకునే సందర్భాలు కొల్లలు. కాకపోతే ఈ యొక్క ప్రేరేపణ వెంటనే జరగవచ్చు లేదా కొన్ని విషయాలలో చాల సంవత్సరాలు కూడా పట్టా వచ్చు.
చాల రోజులు అయింది అనుకొంటా, కృష్ణావతారం సినిమా చూసి !! మన NTR చిద్విలాసంగా చిరునవ్వు చిందిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, ఒక బోయవాడు అయన కాలి యొక్క బొటన వేలిని చూసి లేడి కన్ను అని బ్రాంతి చెంది బాణం వేస్తే అవతారం చాలించి వైకుంటానికి చేరుకొన్నాడు అట. మళ్లీ ఎవరికీ అయినా నమ్మకం కలగదేమో అని, ఆ బోయడు ముసలంలో మిగిలిన చివరి ముక్కని సానదీసి బాణానికి తగిలించు కొన్నాడని కూడా సినిమా లో చూపిస్తారు.  నేను కూడా సరేలే ముని శాపం మరియు యాదవ ముసలం అన్ని కలిసొచ్చాయి కదా అని అనుకోని సరి పెట్టుకొన్నా ఇన్నాళ్లూను. అయితే మొన్న ఎప్పుడో ఈ సందర్భంలో గురించి ప్రస్తావిస్తూ ఒక అయన "ఏమండీ !! ఇది అసలు నమ్మశఖ్యముగా ఉందా" అని ప్రశ్నించారు. పూర్తి గా కృష్ణావతారం లో అనేక మైన చిత్ర విచిత్ర విన్యాసాలు చేసిన అయన కాలి బొటన వేలుకి బాణం గుచ్చుకొంటేనే ప్రాణం పోతుంది అంటే ఎంత అసంబద్దంగా ఉందండీ ? అసలు ఎవరికీ అయినా కాలికి దెబ్బ తగిలితే మహా అయితే సెప్టిక్ అవుతుందేమో కాని ప్రాణం పోతుందా ?
విశ్లేషనికి వస్తే పరమాత్మ యొక్క సాధ్యసాధ్యలని ఎంచడం వంటి పనులు చేయతగడం చేయరాదని సందేశం ఏమో ?  అయన మానవ జన్మ తీసుకోవడం ఎంత అసాధారణమైన విషయమో అదే విధంగా ముగింపు కూడా పూర్తిగా అయన అధీనంలో ఉన్నదే అని మన అందరికి చెప్పే ఉదేశ్యమో అని అనిపించక మానదు. ఏమో మరి అసలు ఆ కోణములో అసలు అలోచిన్చనే లేదు మరి ఇన్నాళ్లూను.
అట్లాగే ఇంకొక సందర్భంలో పాండవులు మొదట సారి జూదం ఆడి రాజ్యం ఓడి, వలువలు ఒలుచుకొంటున్న సతి ని  నిస్సహంగా నించొని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి లో ఉంటే, "గోవిందా" అన్న పలుకుకే పరవశించిన పరమాత్మ పరుగున వచ్చి తన చెల్లలి మానం కాపాడుకొన్నాడు. కానీ అదే పాండవులు మళ్లీ తన పెదనాన్న జూదానికి పిలిస్తే వెళ్లి పన్నెండు సంవత్సరాల వనవాసం, ఇంకొక సంవత్సర అజ్ఞాత వాసం కొసరు కొని తెచ్చు కొన్నప్పుడు ఈయన ఆ దరిదాపు లో కనపడడు. తర్వాత ఎప్పుడో తీరిగ్గా పాండవుల ని అరణ్యంలో కల్సి, "అయ్యో !! మీకెంత కష్టం వచ్చింది. అసలు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నేను శిశు పాలుని తమ్ముడు ని చంపే నిమిత్తం వాడిని వెతికి వెతికి పట్టుకొని చంపే క్రమంలో ఆరు నెలలు పాటు అరణ్యంలో గడపాల్సి వచ్చింది." అంటూ నిస్సంకోచంగా అబద్దం ఆడతాడు అట. శిశుపాలుడిని చంపడానికి కేవలం మానస సంకల్పంతోనే సుధర్సానాన్నిసృజించినాయనికి, అతని తమ్ముడిని చంపడానికి ఆరు నెలలు పట్టిందా ? ఇది అందరు ఎలా నమ్మ గలిగారు ? కాని ధర్మరాజు కానీ తక్కిన పాండవులు కాని ఆయన్ని ఆ ప్రశ్నే వేయలేదు. బహుశా, అయన "ఏమయ్యా !! మీకు జూదం కి వెళ్దామా వద్దా అని గాని, ఓడిన తర్వాత గాని, అరణ్య వాసం సంప్రాప్తించిన తర్వాత కాని నేను గుర్తుకు రాలేదా" అన్న అర్ధం గోచరించింది ఏమో !! మాట్లాడక ఊరు కోడం తప్ప ఏమి చేయలేక పోయారు. శరణాగతి చేసిన వాళ్ళని కాపాడే నిమిత్తం ఎటువంటి దేశ కాల సమయాలలో అయినా సరే నేను ముందర ఉండి ఏదోవిధంగా చక్రం అడ్డు వేస్తా అన్న పెద్ద మనిషి, "నేను" చూసుకొంటానులే అనుకొన్నప్పుడు అంత చక్కగాను దాటు వేయగల సమర్ధత ఉందని మన అందరికి సందేశం ఏమో !!

Tuesday, July 12, 2011

అభిప్రాయలు

 నా అభిప్రాయలు, నా ఇష్టం అని అనుకొన్నప్పుడు పదిమందికి నీ విషయం తెలియాలి అని తాపత్రయం ఎందుకు ? నీకు కలిగిన భావనలు అందరికి తో పంచేసుకోవాలి  అన్న ఆదుర్దా ఎంచేతా ? ఒక వేళ అది రెండో వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తోందని అనిపించినా, నా యొక్క విలువైన ఆలోచనలు చెప్పే తీరుతాను అని అనే మహానుభావులుని ఏమని అనాలి ?
చాలా మంది "నన్ను అడిగితే సార్" అని మొదలు పెడతారు కాని అడిగే దాక ఆగే మర్యాద లేదా శ్రద్ధ వహించరు.అవతల వాళ్ళు అడిగినా అడగక పోయినా తోచింది చెప్పక మానరు. ఈ రోజుల్లో  సోషల్ వెబ్ సైట్స్ లో తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలూ తెలియ పరచడం సర్వ సాధారణం అయ్యింది. దీని వలన మంచి లేదా చెడు ఎంతో చెప్పేటంత గొప్ప వాడిని కాకా పోయినా, ఒక సహజమైన సందర్భాన్ని పరిశీలిద్దాము. మనము అందరు ఏదైనా వార్తలు చదివినా లేక చూసినా ఏ విధంగా స్పందిస్తాము ? లేదా ఎవరు అయినా మీతో ఒక విషయం మీద చర్చ చేసినా సరే. దాని తాలూకు ప్రభావం ఎంతో కొంత అవతలి వారిపై ఉంటుంది అన్న సత్యం నిర్ద్వందం. కాగ నిష్పత్తి మారొచ్చు.
ఎందుకండీ ఇంత ఆందోళన ? ఏమి అవుతుందండి ? ఒక సారి వింటారు, రెండో సారి వినీ విన్నట్టు ఉంటారు, తర్వాత నించి వినడం మానేస్తారు కదా !! ఏదో చేస్తూ, మరేదో ఆలోచిస్తూ వంట పట్టించుకొనే వాటితో మనకి ఎటువంటి ప్రమాదం లేదనుకోండి.ఉదాహరణకి శ్రీ రామ నవమి నాడు మన దర్శక రత్నం రామ గోపాలుడు తన ప్రేలాపాలు అన్నీ త్విట్టేర్ ప్రవేశింప చేసి యువ జనావళి ని ఆలోచించ చేసాను అని సంతృప్తి పడ్డాడట. "వేయి వృక్షాలు" కాదు "విష వృక్షాలు" ప్రశస్తం అని నొక్కి వోక్కా నించాడు. అదేమన్నా అంటే భావ, వాఖ్ స్వాతంత్రం అని అంటారు మరి. మరి ఈ సమాజం లో సదరు ప్రముఖులు అంతా వాళ్ళకి ఇష్తం వచ్చినట్టు వారి వారి భావ జాలాన్ని ప్రదర్శిస్తే ఏమీ తప్పు లేదా ?
ఎవరి గురుంచి అయినా చెడు చెప్పడం ఎంత లోకండి ? రోడ్డున పోయే కుక్కలు కూడా మొరుగు తాయి. దేవుడయితే మరీ ఈజీ ? దిక్కు మొక్కు లేని వాడు కదా ? నేను పదమూడు ఏళ్ళ వయస్సు లో ఇండోర్ కి రైల్ లో వెళ్తూ "రంగ నాయకమ్మ విష వృక్షాలు" ఎదురు కూర్చున్న అయన దగ్గర అరువుచ్చుకొని చదివిన విషయాలు ఇప్పటికి కొన్ని జ్ఞాపకానికి ఉన్నాయంటే కొన్ని సంగతులు చెప్పకనే చెప్పబడతాఎమో. విజ్ఞులు ఆలోచించండి. ఈ రోజున సమాచారం ని లక్షల, కోట్ల మందికి చేరవేసే సాధనాలు ఉన్నాయని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇష్టానికి ప్రవర్తించ వచ్చా ? 
నిన్న రాత్రి నిద్ర బాగా పట్టిందండి !!
మా వీధి చివర కుక్క బాగా మొరుగుతోందండి !!
మా కార్ లో ఈ రోజు గ్యాస్ కొట్టిన్చానండి
నాకు గళ్ళ చొక్కా కంటే పూల చొక్కా అంటే ఇష్టం
మొక్క జొన్న పొత్తు కి ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టం
శని అది వారాల్లో స్నానాలు చెయ్య బుద్ది కాదండీ, అసలు ఎందుకు చెయ్యాలి ?
ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టనే పట్టాడు సుమా
సచిన్ కి భారత రత్న ఇవ్వరాదు !! ఇంకా కొన్ని సంవత్సారాలు ఆగాల్సిందే !!
మాదిరి చొప్పదంటు సమాచారం ఇంటర్నెట్ లో ప్రపంచం అంతా చాటేసుకోవడం మనకి ప్రస్తుత సరదా. మన లాంటి కోన్ కిస్కా గొట్టం గోపాల కృష్ణ లాంటి అభిప్రాయాలు కొంత మందిని ప్రభావితం చేస్తే ప్రపంచానికి ఒనగూరే (అ) ప్రయోజనం కొద్ది మాత్రమే. అయినా కాని నా నించి నా చుట్టూ ఉన్నసమాజం శాస్త్ర బద్ధ జీవనం ఆశిస్తూ ఉన్న అప్పుడు, ఈ పెద్దలందరికీ ఏ నిభందనలు వర్తించవా ?
మరి ఎవడికి వాడు వాడి ఇష్టానుసారం భావ వ్యక్తీకరణ జరపలేనప్పుడు ఎందుకండీ ఈ ప్రజా స్వామ్యం, స్వతంత్రం ?   దిబ్బలో వేసి కొట్టుకోవడానికా ? అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించండి. చరిత్ర లో తమకి అబ్బిన, సిద్దించిన గుణాల ఆధారంగా వారి వారి కాలమానాల్లో ప్రసిద్ది గాంచిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే చిరస్మరణీయులు.  కాగ వీళ్ళందరి లో ప్రస్పుటం గా కనిపించేది "ఒదిగి" ఉండగలగడమే. మరియు వీరంతా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొన్నవాళ్ళే. కొద్ది కాలం క్రితమే ప్రముఖ మైన విప్లవాలకి కారణమైన సమాచార మనే పదునైన ఆయుధం, అత్యంత ప్రమాదకరం కాగలదన్న చిన్నపాటి సత్యం సమాజం లో ఉన్నత స్తానాల్లో ఉన్నవాళ్ళ కి తెలియదు అని అనుకోగలమా ? ఆలోచించవలసిందే మరి !!

Sunday, May 22, 2011

రామ రావణ - నిరంతర సంగ్రామం

श्री रामः भगवद्स्वरूपं वा अथवा सामान्य मानवस्वरूपं वा - इति चर्चायाः विषये बहवः जनाः विशेष आसकथाः भवन्ति।अनेक सम्प्रदायानाम् अनेक देवातास्वरूपाः सन्ति किन्तु केवल रामस्य विषये एव एतयाः चर्चा जनाः कुर्वन्ति। बहवः कवयः सहित्यकाराः च प्रशनार्थं अथवा विमर्शानर्थं अपि भगवतः श्री रामस्य उल्लेखनम् एव चिन्वन्ति । वस्तुतः त्रेतायुगं कल्पितं वा अथवा वास्तविकतां वा? मानवजात्याः अस्थित्वं तदा वर्तते वा ? तस्मिन् समये भूगोलकस्थितयः कथं सन्ति ? ते रामायण कव्यानुसारेण वर्तन्ते वा ? समुद्रे सेथु बन्धनं - कथं संभवं ? यदी रामः विष्णोः अवतारं अस्ति चेत् रावणसंहारं किं कारणेन दुष्करकार्यं अभवत्?राम सामन्यजनः साद्रुशः एव क्लेशकारणेन रुदितवान्।तर्हि वयं रामस्य प्रार्थनस्य किं प्रयोजनम् प्राप्नुमः?रामः वालेः वधं वृक्षस्य पश्चात् स्थित्वा कृतवान् - इति धर्मसंमतं वा ? हे भगवान्! रमाणस्य कृते अनेक प्रश्नाः सदा उत्पन्नं भवन्ति।सामान्य जनाः रामस्य चारित्रस्य समावलोकस्य अपेक्ष्य व्यर्थचर्चानि कर्तुं एव अधिक इच्छा प्रदर्शयन्ति।वस्तुतः भगवान् रामः कदापि दैविकमहिमाः न प्रदर्शितवान्।रामः तस्य संपूर्ण अवतारकाले "अहं दशरथस्य पुत्रः" - एतस्य स्वीयपरिचयम् एव कर्तुं इच्छतिवान्।रामस्य समीप जनाः एव रामे वोष्णोः दर्शनं कृतवन्तः।दसरथः, वसिष्ठः विश्वामित्रः, गुहः, साध्वी अहल्य रामे विष्णोः अवतारस्य महिमाम् अभिज्ञातवन्तः।अरण्ये अनेक मुनयः, ऋषयः च रामे विष्णोः दर्शनार्थं दीर्घकालम् प्रतीक्षा कृतवान्तः।सुगीवग्ननुसरेन पारिव्राजकरूपेण आगत्य महाभक्तः हनुमान् रामास्य प्रथमसन्दर्शनस्य अनन्तरं एव भगवतः दर्शनं कृत्वा साष्टाङ्गवन्दनं कृतवान्।रावणकुम्बकर्णयौ तयोः अन्तिम काले भगवतः दर्शनं कृत्वा अञ्जलिं कृतवन्तौ। रमावतारस्य मुख्यप्रयोजनं किं?केवल रावणकुम्भकर्णयोः निवारणं एव वा अथवा कोऽपि अन्य लक्ष्यं अपि अस्ति वा?यदी स्वदर्मस्य पालनस्य विशिष्टं भगवद्गीता सिद्दान्तरूपेण बोधयति चेत् रामावतारं प्रयोगात्मक निरूपणं भवति खलु।रामस्य गुणानाम् अन्वेषणम् वयं अन्यकुत्रचित प्रदेशे कर्तुं न आवश्यकम्। रामो विग्रहवान् धर्मः - इति स्वयं मारीचः उक्तवान्।रामावतारसमये सकल प्राणिनः रामकार्यस्य कृते अतापयन्।रामः कदापि अधर्मकर्यानां समर्धनम् कृतवान्।सः यदा आवश्यकता अस्ति तदा क्षमा प्रदर्शितवान्।सः धमस्य अतिक्रमणं कदापि न असहत् । ये रामस्य संपूर्णविश्वासेन जीवनं यापयन्ति ते क्रमशस् श्री रामतत्वं मनसि स्थापयन्ति।यदी सर्वदा शुष्कवादान् कर्तुं एव इच्छन्ति चेत् तेषां मनसि रावणस्य आह्वानं निश्चयेन कुर्वन्ति। 
 రాముడు మానవుడా లేక దేవుడా అన్న ప్రశ్న మన అందరికి ఎంత ఇష్తమో !! అన్నీ మానేసి చర్చిస్తాము. ఇంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా అయినా కాని ఒక్క శ్రీ రాముడికే దైవాంశ లేదేమో అన్న వాదన ఇంత ఎక్కువగా ఎందుకని ఉంటోంది? జీసస్, గౌతమ బుద్ధుడు లేక కృష్ణుడు - ఇలా మిగతా వాళ్ళు మామూలు మనుషులే అన్న ప్రశ్న లేక చర్చ ఎందుకని మన భారత దేశం లో ఎక్కువ వినపడదు ? అప్పటి లో రంగ నాయకమ్మ రామాయణ విష వృక్ష్యమే కధాంశంగా ఎందుకని ఎన్నుకొన వలసి వచ్చింది ? పోనీ విమర్శకులే ఎక్కువ అని అనుకోవడానికి కూడా లేదు. మొన్నటి మొల్ల ఇంకా విశ్వనాధుల తదితరులని "రామాయణం గురించి అందరు స్పృశించారు కదా, మళ్లీ మీరు కొత్తగా వ్రాసేది ఏముందని" అడగ్గా, నా రాముడిని ఈ విధంగానైనా తలిచే భాగ్యం వస్తోంది కదా సమాధాన పడడం జరిగింది. అంతేకాదు ఆ మధ్యల్లో శ్రీ రామ నవమి నాడు తన త్వీట్స్ ద్వారా విమర్శలు చేసి యువ ప్రజానీకం లో కొద్దో గొప్పో పాపులారిటీ ని కూడా సంపాదించాడు, రాముడి పేరు ఉన్న మన దర్శక రత్నం "రామ్ గోపాల్ వర్మ" .


అసలు త్రేతా యుగం అనేది వాస్తవమా లేక మిధ్యా ? మనవ జాతి యొక్క మనుగడ అన్ని లక్షల సంవత్సరాల మధ్య ఉందా ? అప్పటి బౌగోళిక పరిస్తితులు రామాయణ ఇతిహసంతో ఏకీభవించగలవా ? సముద్రంలో సేతుభందనమా ? రాముడు భగవంతుడైతే రావణుడిని మట్టుపెట్టడానికి అంత కష్త పడాల్సి వచ్చింది ? రాముడు మన అందరిలాగా కష్తం వస్తే ఏడ్చాడు. ఆయన్ని ప్రార్ధిస్తే ఏమి వస్తుంది ? వాలి ని చెట్టు చాటు నిండి ఎందుకని మట్టు పెట్టాల్సి వచ్చింది ? రాముడు సీత కన్నా పెద్దవాడా కాదా ? ఒక వేళ పెద్దవాడు అయితే అది ఎలా సంభవం ? ధర్మాతిక్రమణం కాదా ? రామాయణం కవి కల్పన అని నిరూపించడానికి మా దగ్గర కావలసినంత ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి మీరు ఎవరు?


అయ్యా బాబోయి !! అమ్మో ఇలా మన ప్రశ్నలకి అంతు దరీ లేదు !! కొన్ని యుగాల కి సరిపడా చర్చ జరుగుతూనే వచ్చింది మరియు ఇంకా బవిష్యత్తులో కూడా  కొనసాగుతుంది అని అనడానికి ఏమీ డోకా లేదు. విచిత్రం ఏమిటి అంటే అవతారం చివరి వరకు అయన ఏ కోశానా దైవత్వం ఆపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యక పోగా కేవలం దశరధ తనయుడిగానే తన స్వధర్మాన్ని పాటించడానికే ప్రయత్నం చేసాడు. కాగా రామ అవతరాన్ని చుట్టూ ప్రాప్తి ఉన్న వాళ్ళు విష్ణు స్వరూపం గా గమనించారు, గుర్తించారు, పూజించారు తద్వారా తరించారు.  దశరధుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, గుహుడు, అహల్య, సీత దేవి, అరణ్యం లో భగవంతుని రాక కై తపించిన మునులు, ఋషులు, గురువు మాటని గౌరవించి వేచిన శబరి ఇలా అందరు రాముడు నడిచిన ప్రతి సందర్భంలో ఆయనలో పరమాత్మని దర్శించారు. రాజాజ్ఞ మేరకు పూర్వ పరాలు విచారిద్దామని మాయా స్వరూపం లో వచ్చిన "హనుమ" తక్షణం ఎదురుగా ఉన్నది సకల విశ్వం తపించే జగదభి రాముడని వెను వెంటనే గుర్తించి తన యొక్క నిజ స్వరూపాన్ని దార్చాడు. చివరకి రావణ కుంభకర్ణలు కూడా తమ శరీరాలని విడుస్తూ రాముడి లో విష్ణు స్వరూపాన్ని దర్శించి పుణ్య లోకాలని చేరుకో గలిగారు. అయితే అందరూ రావణ వధ అయ్యేవరకు ఈ విషయాన్నీ గోప్యంగానే ఉంచారు.


రామ అవతారం కేవలం రావణ కుంభకర్ణ తదితర రాక్షస నిర్మూలనమేనా లేక మరి ఏదైనా ప్రయోజనమని ఆశించి వచ్చిందా ?ఒక్క మానవ జన్మ  లో సంసారంలో ఉంటూ స్వ ధర్మాన్ని పాటిస్తూ ముక్హ్తి సాధన సిద్దిస్తుందా లేక అది ఒక అభూత కల్పనా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ సాధ్యాసాధాలు నిరూపిస్తూ ధర్తి లో నిలబడ్డాడు. నిర్గుణ, నిరాకర, నిరాధారం అయిన ఆ భగవత్ స్వరూపం మానవాళి యొక్క మార్గ నిర్దేశం కోసం అన్ని భరిస్తూ, పాంచ భౌతిక స్వరూపం తీసికొని అవతారం యావత్తు ప్రకృతి కట్టుబాట్లు కి లోబడి కార్య సాధన ని సాధించాడు.  రాముడు యొక్క గుణగణాలు, విశేషాలు ఏమిటో మనం మరెక్కడో వెతకాల్సిన పని లేదు. మారీచుడు రావణాసురిడితో సంభాషిస్తూ  "ధర్మానికి పోత పోస్తే వచ్చే విగ్రహమే రాముడు" అంటూ అతని కుట్రాలోచానికి అడ్డం వేయడానికి ప్రయత్నం చేస్తాడు. రామాయణం యావత్తు చుట్టూ ఉన్న ప్రకృతి సర్వం రామ కార్యం నిర్వహించడానికి ప్రతి క్షణం తపించింది, తల్లడిల్లింది. రామావతారం మొత్తం అధర్మాన్ని ఎక్కడ సహించలేదు. కుదిరిన చోట క్షమా గుణాన్ని భోదించింది అట్లాగే అతిక్రమణ ని శిక్షించింది. సులభ మార్గం లో లభించే ఐశ్వర్యాన్ని  తూలనాడింది. జాబాలి వంటి మంత్రులు రాజాపేక్ష చూపిస్తూ జరిపిన అవైదిక సంభాషణలని ఖండించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరి మాటని ఆదరించే గుణాన్ని మానవాళి కి ఆవిష్కరించింది.


ఆనాటి నిండి రామ నామం యొక్క మహత్తు ని నమ్మిన వారు మననం చేసారు. పారాయణలు నిరంతరం జరిపారు. మనసా వాచా కర్మణా రాముని తత్వాన్ని అవలంభించారు. ఇంత కష్టం మనకేందులే అనుకొన్న వారు, రాముడు అభూత కల్పనే అని వాదనలు జరుపుతూ వస్తున్నారు. నమ్మినప్పుడు  కొలువు బంగారమై వారి వారి మనస్సుల్లో రామత్వాన్ని నింపాడు ఆ సాక్షాత్తు శ్రీ రామ చంద్రుడే. "రాముడు ఎవడులే" అనుకొన్న ఆలోచనలు రావణ ప్రవుత్తికి దారి తీస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రామ రావణ సంగ్రామం ఈ జగత్తు ఉన్నంత వరకు ఇలా కొన సాగ వలసిందే !!