Showing posts with label Story. Show all posts
Showing posts with label Story. Show all posts

Tuesday, July 12, 2016

చక్ర భ్రమణం

సరోజా ! ఇది చూసావా.. ఈ రోజు ఉష్ణోగ్రత వివరాలు - 44 c.. ఇంకేముంది! దుంప తెగిందన్న మాటే !

అయ్యా బాబోయ్! ఇంకా రోహిణి కార్తె చూస్తే కనీశం నెల పైనే ఉంది. రాను పోను, మొత్తం ఆరు కిలోమీటర్లు, కాలి నడక ! ఎట్లా నెగ్గుకొస్తారో ఏమిటో !

ఎట్లా ఏముంది..  ఉద్యోగం అన్నాక తప్పుతుందా! పోనీ ఎండ ఒక్కటి అనుకొంటే పర్వాలేదు.. సాయంత్రం ఆరు దాటిన తర్వాత అయినా కూడా వాడ గాల్పులాయే!

పోనీ సైకిల్ ఒకటి తీసికోరాదండీ.. హంబరో, హీరో నో ?

తీసికొంటే, బావుంటుంది కానీ, మనకి వచ్చే జానా బెత్తడు జీతానికి, ఉన్న పళాన వెయ్యి రూపాయల  ఖర్చు అంటే మాటలా? పోనీ సెకండ్ హ్యాండ్ తీసుకొందామంటే, ఎవరినో మోసిన ఇనప సామాను మన ఇంటికి ఎందుకంటావ్..

అయిందిగా ఆ ముచ్చట కూడా! మీ బావ 15 ఏళ్ల నాటి అంటగట్టిన సైకిల్ ఒక్క మూడు నెలలు వాడారో లేదో, పాత ఇనప సామాన్ల వాడు కూడా ఛీ పొమ్మంటున్నాడు.

 ఇది ఇప్పట్లో తెమిలేది కాదులే. ఈ వేసవి కాలం ఎలాగోలా నడపాల్సిందే.. 

దాదాపు నలభై ఏళ్ల క్రిందటి మాట! రామారావు బెజవాడ లో ఒక ఆడిటర్ గారి ఆఫీస్ లో గుమస్తా. వరసే కదా అని దూరపు చుట్టాలమ్మాయిని చేసికొన్నా, సరోజ అందం, అణుకువలకి అత్యంత ముగ్దుడైన రామరావు చాలా దగ్గరగానే సంసారం చేయసాగాడు. ఎంత దగ్గరగా అంటే, పెళ్ళైన సంవత్సరం తిరక్కుండానే, అదృష్టం ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించింది. "లక్ష్మీ దేవోయ్, రామరావ్! ఇంక నీకు తిరుగు లేదంటే నమ్ము!", అని పిల్లని చూట్టానికి వచ్చిన పైన మామ గారు సెలవిస్తే, శుక్రవారాలు తలుపు దగ్గరగా కూడా వెయ్య రాదని సరోజ కి స్త్రిక్ట్ వార్ణింగ్ ఇచ్చాడు. పిల్ల పుట్టడం తో కొద్దీ పాటి ఎడబాటు సంభవించినా, భర్త బాధ్యతలని ఏనాడు రామ రావు విస్మరించక పోవడంతో, మిగతా ఏడుగురు లక్ష్మీల మాట ఎట్లా ఉన్నా, సంతాన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించడంతో, మరో ఇద్దరు మగ పిల్లల ఇట్టే పుట్టడం, రామరావు "కుటుంబ రావు" గా పరివర్తనం చెందడం ఇట్టే జరిగి పోయాయి. 

రామారావు స్వతహాగా తెలివైన వాడు. బండెడు సంసారం మరియు ఇతరత్రా కుటుంబ కారణాల రీత్యా,  వాళ్ళ నాన్న పదో తరగతి దాటగానే, ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. అన్నయ్యల దెగ్గర చేరి, ఇంకో రెండు సంవత్సరాలు బండి లాగించాడు రామ రావు. ఈ క్రమంలో, తెలిసిన బంధువులాయన దగ్గర అకౌంట్స్ చూడడం, పన్నుల కి సంబందించిన వ్యవహారాల్లో కొద్దో గొప్పో, రాణింపుసంపాదించుకున్నాడు. తర్వాత, ఇంక నా వల్ల కాదురా అని రామ రావు ని అదే ఊర్లో ఉన్న ఆడిటర్ గారి దగ్గర లెక్కలు చూసే పనిలో పెట్టేసాడు.  ఈ క్రమంలో రామరావు చురుకు, ఉత్సాహం చూసి నచ్చిన ఆ ఆడిటర్ గారు, నెమ్మదిగా కొంచెం పేరు ఉన్న వ్యాపారస్తుల అకౌంట్స్ చూడమని పురమాయించాడు. పేరుకు "రాముడైనా", మనస్తత్వం అంతా ఆంజనేయుడవటం, అతి కొద్దీ కాలం లోనే యజమాని నమ్మకాన్నిచూరగొని, హెడ్ గుమస్తా గా ప్రమోషన్ రావడం, తన కింద ఇంకో ఇద్దరు గుమస్తా లను నియమించడం ఇట్టే జరిగి పోయాయి. మరీ డిగ్రీ అయినా లేకపోతే ఎం బావుంటుంది అని, ఎంత పని ఒత్తిడి ఉన్నా ప్రైవేట్ గా B.COM పూర్తి చేసాడు. గవర్మెంట్ ఉద్యోగం కాదనే కానీ, రామరావు పని చేసే సంస్థ వారికి  మిగతా వ్యాపారాలు కూడా ఉండడం తో అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతి నిండా పనే.  

"అసలే ప్లస్ లో ఉన్నావ్! పైగా జీతం కూడా పెరిగింది.. నక్కని తొక్కావురా రామారావ్!", అంటూ నెల్లూరు నించి కాకినాడ ప్రయాణం చేస్తూ ఊరు మీదుగా వెళ్తూ ఆగి పలకరించక పోతే ఏమి బావుంటుందని ఆగిన బాబాయ్ వరుస అయ్యే బంధువు ఇచ్చిన కితాబు. "ఎం ప్లస్సో బాబాయ్! ఈ సంసారరధచక్రాలు లాగడం అంటే మాటలు కాదు. గత అయిదు సంవత్సరాల్లో,  గానుగెద్దు తిరిగినట్టు ఆఫీస్ నించి ఇంటికి, ఇంటి నించి ఆఫీస్ కి ఎండైనా, వానైనా కాలి నడక తప్పట్లేదు కదా. ఒక్క సైకిల్ కొనుక్కొందామంటే, ఏదీ..", అంటూ వాపోయాడు రామారావు. "ఏమి చేస్తాం నాయనా, త్రేతా యుగంలో శ్రీ రాముడికే తప్పలేదు ఈ సంసార ఈతి బాధలు, కలియుగం లో రామరావు మాత్రం తప్పించమంటే ఎట్లా", అంటూ  తన బండి టైం అవ్వడం తో బయలుదేరాడు. 

చూస్తూనే పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలుపెట్టారు. రామరావు నడవటం అన్నా, నడవక్కర లేకుండా గమ్యం చేరే సమస్త చరా చర ప్రాణి కోటి అన్నా తెలియని ద్వేషం పెంచుకున్నాడు. "ఆహా! మనం కూడా భూ కైలాష్ సినిమా లో నారదుడికి మల్లె ఆకాశ మార్గం లో ప్రయాణిస్తే ఎంత బావుంటుందో కదా.. వెదవ పిచ్చుక ఒక చోటి నించి ఇంకో చోటికి ఎంత హాయి గా ఎగురుతోందో కదా..", ఇలా సాగేవి అతని ఆలోచనలు రోజు తనకి తప్పని నడక ప్రయాణంలో. పోనీ ధరించి సైకిల్ కొందామంటే, ప్రతి సంవత్సరం పెరిగే యాబయ్యో, వందో జీతం తో పాటు ఇంటి ఖర్చులు ఇంకొంచం పై చెయ్యి కావడం తో బొటాబోటిగా సరి పోయేది. ఎప్పుడైనా, పండక్కో లేదా యజమాని ఇంట్లో శుభ కార్యాలకో లభించే అదనపు ఆదాయం, భార్య పిల్లలకి బట్టలు కొనగా మిగిలే అనిర్వచనీయమైన సంతోషానికి సాక్షీ భూతం గా నిలబడి, తన కష్టాన్ని తనలోనే అణుచుకొనే వాడు. 

మిగతా రోజుల్లో ఎలా ఉన్నా, ఎండా కాలం లో మాత్రం నెట్టి మీద ఒక రుమాలు గుడ్డ కట్టుకొని నడవాలంటే అంతంత దూరం నడవాలంటే ప్రాణం ఉసూరుమనేది. "ఈ నెలలో అయినా సైకిల్ కొనాల్సిందే", అని ఆ రోజుకి నలభై ఒకటో సారి గట్టిగా తనకి తాను చెప్పు కొన్నాడు. అందులోనూ క్రితం రోజు రాత్రి "installments లో అయినా వెధవ సైకిల్ ఒకటి కొందామండీ" అంటూ భార్య ఊతం కూడా రామ రావు దృఢ నిర్ణయానికి కారణ భూతం అయిందేమో.  మొత్తానికి రాబోయే ఆదివారంకి శుభ ముహూర్తం నిర్ణయించుకున్నారు, భార్యా భర్తలిద్దరూ. శనివారం ఒన్ తౌన్ లో ఉన్న సైకిల్ షాప్ కి వెళ్లి ఇంస్టాల్మెంట్ వివరాలు అన్నీ వాకబు చేసి ఇంటికి చేరే టప్పటికి, ఇంటి నిండా పండగ వాతావరణం కనిపించింది. కొంచం ఎడమ కన్ను అదురుతున్నప్పటికిన్నీ గుండె దిటవు చేసికొని, సరోజ ఇచ్చిన కూజా నీళ్లతో గొంతు తడుపుతుండగా, "ఏమండీ విన్నారా ? మా పెదనాన్న గారి అబ్బాయి, అదేనండి మా అమెరికా అన్నయ్య రేపు మన ఇంటికి వస్తున్నారట !! ఈ రోజే కబురొచ్చింది" అంటూ ఉబ్బి తబ్బిబ్బు అవుతూ చెప్పింది. ఎప్పుడో పెళ్లి నాటికి చూశాడాయన్ని రామ రావు. "సరే అంత పెద్ద హోదా గల వాళ్ళు మనని  గుర్తు పెట్టుకొని మరీ వస్తున్నారంటే ఆనందించ దగ్గ విషయమే కానీ, "దీనికి నా సైకిల్ కి ఏమైనా లింక్ ఉందా" అని గునిసాడు. "మరి ఎం చేస్తాం, చెప్పండి? రాక రాక మన ఇంటికి వస్తున్నారాయె. వస్తూ పిల్లలికి ఏదో ఒకటి  తేక పోరు. ఏదో మన స్తాయి లో వాళ్ళ పిల్లలికి బట్టలయినా ఇవ్వక పోతే ఎలా చెప్పండి?", అంటూ అనునయనంగా చెప్పింది సరోజ. సరే, తప్పుతుందా అనుకొంటూ, సైకిల్ అడ్వాన్సు కోసం పక్కన పెట్టిన డబ్బుతో , సరోజ చెప్పిన వస్తువులు కొనడంతో నిమగ్నం అయ్యాడు. వచ్చిన చుట్టాలతో అమెరికా విశేషాలు మాట్లాడుతూ ఉండగా రామారావు ఏదో సందర్భంలో, "ఏమండీ ! మీ దేశం లో ఖాళీ సమయాల్లో ఏమి చేస్తూ ఉంటారండీ", అని అడిగాడు. "ఖాళీ ఎక్కడండీ ? అమెరికా లో ప్రతి నిమిషం విలువైనదే నండీ! కానీ రోజు సాయంత్రాల్లో మాత్రం, నేను నా భార్య కనీసం ఒక్క అర గంట అయినా నడుస్తూ ఉంటాం. వ్యాయాయం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదండీ", అనగానే భార్యా భర్తలు ఇద్దరూ మోహా మొహాలు చూసుకొన్నారు. రామా రావు కి మళ్ళీ నడక కష్టాలు తప్పలేదు.

కానీ రోజులు అన్నీ ఒకే మాదిరి గా ఉండవు కదా. మారే ప్రపంచ పరిస్థితులతో పాటుగా భారత ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా పగ్గాలు విడిచిన రేసు గుర్రం లాగా పరిగెత్తడం మొదలు పెట్టింది. రామారావు ఎంత పని ఒత్తిడి ఉన్నా, C.A పరీక్షలు పట్టు పట్టి పాస్ అయ్యాడు. అసలే అకౌంట్స్ మరియు పన్నుల వ్యవహారాలులో మంచి అనుభవం గడించిన వాడు అవ్వడం మూలాన, అతనికి అంటూ ప్రాక్టీస్ ఏర్పడడం పెద్ద కష్టం అవ్వలేదు. అదృష్ట వశాత్తూ పిల్లలు ముగ్గురూ ఆణి ముత్యాలుకి మల్లె చదువు లోనూ, గుణము లోనూ ఎవ్వరికీ తీసిపోని విధంగా నిలబడ్డారు. అమ్మాయి ఈ మాత్రం కోచింగ్ అవసరమే లేకుండా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ సంపాదించింది. మొగ పిల్లలు ఇద్దరూ అమ్మాయి అంత కాక పోయినా గవెర్నమెంట్ కాలేజ్ లోనే సీట్లు సంపాదించారు. "లక్షలకి లక్షలు గుమ్మరిస్తే  ఏమి లాభం! స్వతహాగా మెరిట్ ఉండాలండి. మా పిల్లలని చూడండి, అందరికి బ్రహ్మ ప్రళయం అయిన సీట్లు ఇట్టే సంపాదించేసారు", అని అడిగిన వాడికి అడగని వాడికి చెప్పసాగాడు. "ఊరుకోండి! మీరు మరీనూ! పిల్లలకి దిష్టి తగులుతుంది", అంటూ సరోజ ఉప్పు డబ్బాలు కరిగించేసింది.

తన ప్రాక్టీస్ లో గణనీయంగా పెరుగుదల  ఉండడంతో, సైకిల్ కె గతి లేని రామ రావు, ఉన్న పళాన పెద్ద కష్టపడకుండా స్కూటరే కొనేసాడు. సరోజ  చుట్టూ పక్కల వాళ్ళ అందరికి ఒక చిన్న పాటి తేనీటి విందు ఏర్పాటు చేసింది. "మా వారికి వాహన యోగం చిరకాల వాంఛ అండీ. ఇన్నాళ్లకి నెరవేరింది" ఆంటూ తెగ మురుసుకు పోయింది. గుళ్లో పూజారి నిమ్మకాయలు మీదుగా స్కూటర్ నడప మన్నప్పుడు మొదలు రామ రావు నడక అన్న పదానికి దాదాపు స్వస్తి పలికాడు. వీధి చివర ఉన్న కిరాణా కొట్టు కి వెళ్లాలన్నా స్కూటర్ కె పని చెప్పేవాడు.

భార్యా భర్తల పూర్వ జన్మ సుకృతమో ఏమో, అమ్మాయి తన కాలేజ్ లోనే చదువుకొన్న మరో డాక్టర్ అబ్బాయి తో కాణీ కట్నం లేకుండా పెళ్లి జరిగింది. అబ్బాయిలు ఇద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. రామారావు ఉద్యోగ పెరుగుదల తో పాటు, పిల్లలు ముగ్గురూ చేతికి అందిరావడం తో ఒక శుభ మూహూర్తాన మూడు వందల గజాల స్థలంలో లోను తీసికొని చక్కటి ఇల్లు కూడా కట్టుకోగలిగాడు. అమ్మాయి, అల్లుడు స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి ఊళ్ళో మంచి హస్త వాసి గల డాక్టర్ల గా పేరు పొందారు. మొగ పిల్లలు ఇద్దరూ వాళ్ళు పని చేసే కంపెనీలలోనే అవకాశం రావడంతో అమెరికా లో స్థిర పడ్డారు. "ఇంకా, ఆ డొక్కు స్కూటర్ ఏమి నడుపుతావు నాన్న! మంచి కార్ కొనుక్కో అని పెద్దవాడు ఒక A.C కార్ కొని పెట్టాడు. ఎండా కాలం ఏమీ అవస్థ లేకుండా చిన్న వాడు ఇంట్లో అన్ని గదుల్లో A.C పెట్టించాడు.

ఇప్పుడు సరోజకి ప్రొద్దునే వంటకి ఒక మనిషి, ఇంటి పనులు చేయడానికి నమ్మకమైన పని మనుషులు స్థిర పడ్డారు. ఇంకా ఏ మాత్రం కష్ష్ట పడద్దు అంటూ పిల్లలు వాషింగ్ మిషన్లు, డబుల్ డోర్ ఫ్రిడ్జిలు, ఫ్లాట్ స్క్రీన్ టీవీ లు సమస్తం అమర్చారు. సరోజ, రామ రావు లు క్రమ క్రమం గా "సరోజమ్మ గారు, రావు గారు" గా పరి వర్తన చెందారు. ఎప్పుడూ బక్క పలచగా ఉండే రామ రావు కొంచం రంగది వచ్చి ఒళ్ళు కూడా చేసాడు. వయస్సు కి తగినంత పొట్ట కూడా వచ్చి, తన హై క్లాస్ మిత్రులతో అప్పుడప్పుడు ఇంకా కొంచం ఒళ్ళు చేయడానికి దోహద పడే బీర్, స్కాచ్  వంటి అలవాట్లు కూడా  సంక్రమించాయి. రోజూ అలవాటు గా దైనందిక సీరియళ్లు అన్నీ ముగించు కొని పదుకొనె ముందు న్యూస్ ఛానెల్స్ లో ప్రపంచంలో సామాన్యుడికి అవసరం లేని విషయాల పైన తీవ్రమైన చర్చలన్నింటి లోనూ  లీనమై, కొన్ని మంచి పాయింట్స్ రేపటి క్లబ్ లో మిత్రులతో పంచు కోవడానికి బాగా మననం చేసికొని పడుకొన్నాడు. కొంచం మగత గా నిద్ర పడుతూ ఉండగా, కొంచం గుండెల్లో భారం గా అనిపించడం మొదలు అయ్యింది. ఏంటో అర్ధం గాక భార్య ని లేపుదామా అనుకొంటూనే, "ఎందుకులే కంగారు పడుతుంది, అదే తగ్గుతుంది లే, కొంచం సేపు చూద్దాం" అని అనుకొన్నాడు.. ఏ తెల్ల వారు జామునో, రాత్రంతా అటు ఇటు దొర్లుతున్న రామ రావు ఇంక లాభం లేదు అనుకోని సరోజని నిద్ర లేపి హాస్పిటల్ కి  తీసికెళ్ళమని చెప్పాడు.

వెంటనే, ఊళ్ళో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి చేరిన రామ రావు కి, వైద్య శాస్త్రం లో ఉన్న అన్ని రకాల టెస్ట్స్ చేసిన తర్వాత, వార్త విని హూటా హూటా న పరిగెత్తుకొచ్చిన అమ్మాయి తో చీఫ్ డాక్టర్ ఇలా చెప్పాడు. "ఎం లేదమ్మా!! నీకు తెలియంది ఏముంది. ఒంట్లో కొవ్వు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడంతో మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. ఒక నాలుగు రోజులు ఆబ్సెర్వేషన్ లో ఉంచి పంపిస్తాం", అంటూ రామ రావు వంక తిరిగి, "రావు గారు! తిండి లో ఉప్పు కారం పూర్తిగా తగ్గించేయాలి. ఇంక నించి రోజూ కనీశం నాలుగైదు కిలోమీటర్లు నడవాలండీ. పాపం మీకు నడక అలవాటు ఉందొ లేదో! కానీ తప్పదు అలవాటు చేసికోవాల్సిందే", అని పక్క రూం లో ఉన్న పేషంట్ ని చూడ్డానికి కదిలాడు.

రచయిత :  గతంలో మధ్య తరగతి కుటుంబాల్లో అదనంగా ఒక వస్తువు కొనాలంటే దాదాపు బ్రహ్మ ప్రళయమే !! టి వి, సైకిల్, పట్టు చీర ఇలాంటి వస్తువు కొనాలంటే వాళ్ళు పడే ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. మారిన పరిస్తుతుల రీత్యా వస్తు సమీకరణ సులభతరం అయినా, వారి జీవితాల్లో వాటి స్తానం లో ఇతరత్రా సమస్యలు చోటు చేసికొన్నాయన్న సందేశం కోసం చేసిన  చిరు ప్రయత్నం 

Wednesday, January 26, 2011

విలువలు

రాత్రంతా నిద్ర లేదు. కరెంట్ నాలుగు అయిదు సార్లు పోయుంటుందేమో. ఈరోజు తొందరగా వెళ్ళాలి అన్న టెన్షన్ ఒకటి. ఒక్క పది నిముషాలు పడుకుందాము కళ్ళు మూసుకోపోయాను. కొంచం మగత గా నిద్ర పట్టిందేమో లేదో "ఏమండి, ఈ రోజు తొందరగా వెళ్ళాలి అన్నారు. లేస్తున్నారా" అంటూ శ్రీ మతి గొంతు వినపడింది. ఇక లాభం లేదు అను కొంటూ లేచి బాత్ రూం వైపుకు సాగాడు.


"ఏమోయ్ !! నీళ్ళు రావడం లేదు. చెప్పవా రాత్రి owner కి పొద్దున్నే వెళ్తున్నాము. మోటర్ వెయ్యడం మరవద్దు అని" గావుకేక పెట్టాను. ఉలిక్కిపడి లేచింది మా ఆవిడ. "చెప్పానండి. రావట్లేదా నీళ్ళు ?" కళ్ళు మూతలు పడుతుంటే అతి కష్తం మీద మాట్లాడింది సతీమణి. "అబ్బా !! ఈయనతో చచ్చే చావు వచ్చింది. ఎప్పుడైనా పొద్దున్నే వెళ్ళాలి అంటే అప్పుడే ఈ పెంట పెడతాడు, ఇంట్లో ఏమైనా ఉన్నాయా నా వరకు సరిపోయేంత వరకు" కొంచం కంగారు గా అడిగాను. ఆవిడ ఆ బిందె, బకెట్ లో నించి మిగిలనవి కొన్ని అయిన వరకు సర్దింది. "ఛీ ఛీ వీళ్ళకి పక్క వాళ్ళు అంటే కొంచం విలువ కూడా లేదు" అంటూ సణుగుతూ ఏదో కాకి స్నానం కానించి బయట పడ్డాను.


సన్యాసి రావు బ్యాంకు లో  ఆఫీసర్ గా ప్రమోషన్ మీద ఈ మధ్యే కాకినాడ నిండి హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అయ్యే ప్రయత్నం లో ఉన్నాడు. ఈ రోజు తన చిన్న అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కి తన దూరపు చుట్టం ఫ్రెండ్ ఈ ఏరియా కి corporator కావడంతో కొంచం recommendation కోసం బయలు దేరుదాము  అని ప్లాన్. చెప్పులు వేసుకుంటూ ఉండగానే సెల్ మోగింది. "బయలు దేరరా, సుబ్బా రావు గారు చాల నిక్కచ్చి గా ఉంటాడు టైం అంటే", హడావుడి గా అన్నాడు మా బావ మరిది కజిన్ సురేష్. "ఒక్క పదిహేను నిమిషాల్లో ఉంటానండి" ఆటోలు దొరకవేమో అన్న భయాన్ని దాచుకొంటూ చెప్పాను.


ఇల్లు కొంచం మెయిన్ రోడ్ దూరం ఉండడంతో ఆటో లు దొరకడం లాటరీ కన్నా ఘోరం. నాలుగు అడుగులు వేసాడో లేదో అదృష్టం కొద్ది ఆటో సౌండ్ వినపడింది.  "బాబు !! దిల్ సుఖ్ నగర్ ఆతా ?" సాధ్యమైనంత శ్రావ్యంగా అడిగాను. హైదరాబాద్ లో ఆటో వాళ్ళు అడిగే విధానం కి చాల ప్రాధాన్యం ఇస్తారు. నచ్చక పొతే అటుకేసి వెళ్తున్నా వాడు ఖాళీ గా వెళ్తాడు కాని బేరం ని ఖాతరు చెయ్యడు. "నై ఆతా" అంటూ రాజ కుమారుడు శ్వేత అశ్వాన్ని స్వారి చేసి నట్టు గా ముందరకి కదల పోయాడు. "బాబు !! కనీసం మెయిన్ రోడ్ వరకు వస్తావా" పూర్తిగా బతిమలుతున్నట్టు గానే అడిగాడు. ఏ కళ మీద ఉన్నాడో కాని "తీస్ రుపయ్యా" అన్నాడు. అయిదు నిమిషాల నడక అయినా కాని తప్పక ఎక్కాను. కడుపు మండుతున్నా ఏమీ మాట్లాడకుండా తర్వాతి ఆటో వాడిని ఎలా బుట్టలో వెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. మాములు గా మొత్తం కలిపి ముప్పై రూపాయలు అయ్యే ఆటో ఖర్చుకి డెబ్బై రూపాయలు చెల్లించి సుబ్బా రావు గారింటికి అనుకొన్న దానికన్నా అయిదు నిముషాలు లేట్ గా చేరుకొన్నాను. "ఏంటండి ఆలస్యం ? అయన కి అసలే కోపం ఎక్కువ" అంటూ సురేష్ కంగారు పెట్టాడు. "ఛీ ఛీ ఈ ఆటో వెధవలకి జనాలు అంటే కొంచం విలువ కూడా లేదు అండి. డబ్బు ఎలాగు కాజేస్తారు మళ్లీ మంచిగా కూడా మాట్లాడలేరు "  అన్నాను కొంచం చిరాగ్గా. "సరే సరే !! వాళ్ళ గురుంచి తెలిసిందే కదా !! పదండి, పదండి"  అంటూ పరుగు లాంటి నడక తో గేటు తీసుకొని లోపలి కి వెళ్ళాం. "బావున్నారా" అంటూ సుబ్బారావు గారి సతీమణి అనుకొంటా స్వాగతించారు మమ్మల్ని. "పర్వాలేదండి. ఈయన సన్యాసి రావు గారని మా చుట్టమండి" అంటూ పరిచయం చేసాడు. ఆవిడ నన్ను పలకరించే ముందరే "సుబ్బారావు గారు కలవ మన్నారండి" అని అసలు విషయానికి వచ్చాడు. "అవునా !! అయన ఇంతకు ముందరే మార్నింగ్ వాక్ కి వెళ్లారు అండి. కూర్చోండి అయినా" అంటూ మమ్మల్ని కూర్చోపెట్టింది.


మాకు చెప్పిన టైం కి ముఫై నిమిషాల తర్వాత సుబ్బారావు గారు నెమ్మదిగా వాళ్ళ కుక్క తో సహా వచ్చారు. "మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కమిటీ చైర్మన్ బాగా క్లోజ్ అండి. వాడు మనం వారానికి కనీసం ఒక్క సారైనా కలవసిందే" అంటూ ఇంకో పదిహేను నిమిషాల సోత్కర్ష తర్వాత "చూద్డామండి" అంటూ పస లేని భరోసా ఇచ్చాడు. పొద్దున్నే నా పని మీద బయలు దేరి వచ్చిందందుకు గాను మరో వంద రూపాయల బిల్ చెల్లించి ఇద్దరం కల్సి స్వాగత్ లో టిఫిన్ కార్యక్రమం కానిచ్చాము. "ఏంటండి !! ఈయన కి తన టైం తప్ప పక్కవాళ్ళ టైం అంటే కనీసం విలువ ఉండదా" అని గునిసాను. "పని మనది కదండీ. చూద్దాము" అంటూ సురేష్ secratariet  వైపు కి తన స్కూటర్ ని మళ్ళించాడు. నేను కూడా నా బ్యాంకు కి టైం అవుతూ ఉండడంతో బస్ స్టాండ్ వైపు కి కదిలాను.

ఇవ్వాల్టి రోజుల్లో బ్యాంకు లో ఉద్యోగం అంటే కనీసం ఒక నలబై చేతులు ఉండాల్సిందే. ఓపెన్ కౌంటర్ సిస్టం వచ్చిన తర్వాత బల్ల చుట్టుతా మూగే కష్టమర్లతో వేగాలి.
"సార్ !! జాయింట్ ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి సార్. ఇవ్వాల...." అంటూ ఒక కుర్రాడు వాళ్ళ అమ్మ తో వచ్చి ఇంకా ఏదో అడగ బోయాడు. "ఎకౌంటు ఓపెనింగ్ అన్ని 11 తర్వాతే" అని పక్కకి పంపించేసాను.
"నమస్తే రావు గారు !! ఏంటి మమ్మల్ని లాగించేస్తారా ఈ రోజు అయినా" అంటూ అన్నపూర్ణ బిల్డింగ్స్ పార్టనర్ నవ్వుతూ ఎదురుగ్గా నిలబడ్డాడు. "అయ్యో !! బలే వారు సార్. మీరు చెక్స్ ఇక్కడ వదిలెయ్యండి సార్. రెండింటికి కుర్రాడిని పంపితే బుక్ లో ఎంట్రీ వేయించి పంపుతాను సార్" అని నేను నా సీట్ లో నించి లేచి మరి చెప్పాను.
"సార్ !! నా ఆన్ లైన్ ఎకౌంటు authorize చెయ్యాలి అండి. కొంచం అర్జెంటు" అని ఒక కుర్రాడు స్టైల్ గా నా ముందు నిలబడి అడిగాడు. చూడడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు లాగా ఉన్నాడు. నాకు సెట్ అప్ చెయ్యడానికి access ఉన్నా కూడా, "ఆన్ లైన్ బ్యాంకింగ్ అంతా ఆ రైట్ సైడ్ లో నించి రెండో కౌంటర్" దగ్గర అని తల ఎత్తకుండానే చెప్పాను. "మరి ఇక్కడ కూడా అని అన్నారండి" అని ఏదో చెప్పుతున్నాడు ఆ కుర్రాడు. నేను మళ్లీ ఆ అబ్బాయి వంక చూడ కుండా నా పని లో మునిగి పోయాను. ఇంతలో మా బ్రాంచ్ మేనేజర్ లోపలి రమ్మని ఇంటర్ కం లో ఫోన్ చేసి చెప్పాడు. ప్రీమిఎర్ కస్టమర్ లతో ఒక గంట గడిపిన తర్వాత బయటకు వస్తుంటే ఇందాక ఎకౌంటు ఓపెన్ చెయ్యాలి అన్న కుర్రాడు మళ్లీ ఎదురు పడ్డాడు. "సార్ !! మా పని పూర్తి చెయ్యండి సార్" అంటూ.  అతని కాగితాలు చూస్తూ,  "అందేంటి బాబు. మీ అమ్మది ID proof తీసుకు రాలేదు  ఏంటి". "నిన్న ఓన్లీ primary account holder ది ఉంటె చాలు అన్నారు సార్, ఆ కౌంటర్ లో ఉన్న అయన. సార్ కొంచం హెల్ప్ చెయ్యండి సార్" బతిమాలుకొన్నాడు ఆ కుర్రాడు. "కుదరదమ్మా !! రేపు వచ్చినప్పుడు అన్ని తీసుకు వచ్చేయి" అని adjust చేసి పని అయిపోగోట్టే ఛాన్స్ ఉన్నా దాటేసాను. వాళ్ళ అమ్మ తో కొంచం జాలి గా అక్కడ నించి కదిలాడు ఆ కుర్రాడు. మిగత పని సందడి లో పడి లంచ్ టైం  అన్న విషయం కూడా మర్చి పొయ్యాను. మరి ప్రపంచంలో జనం అందరికి డబ్బు తోనే నిత్య కళ్యాణం కదా, ఇండియా లో బ్యాంకు లు ఎన్ని పెట్టినా కిట కిట లాడుతునే ఉంటాయి. లంచ్ కానీ లేవ పోతూ ఉంటే కొంచం పెద్దాయన "అయ్యా !! కొంచం DD తెలియక తప్పు అడ్రస్ కి తీసుకొన్నాను. దీన్ని కాన్సిల్ చేసి మళ్లీ తీసుకోవాలి అండీ. అయన ఏమో మీ అప్రూవల్ ఉండాలి అంటున్నారు. చూస్తారా" అని అడిగాడు. "ఇది పర్సనల్ బ్యాంకింగ్ మేనేజర్ గారు చూడాలి అండీ. రేపు రావాలి మీరు. అయన ఈ రోజు లీవ్ లో ఉన్నారు" దాటేసాను. కొంచం గొనుక్కుంటూ అయన అక్కడ నించి వెళ్ళాడు. అసలే పొద్దున్న నించి చిరాగ్గా ఉన్నానేమో నా పనులే కాక మళ్లీ పక్కవాళ్ళ పనులు చేసే ఓపిక అస్సలు లేదు.

ఆఫీసు నించి సుమారు ఆరు ఇంటి సమయం లో బయట పడి ఇంక ఓపిక లేక ఆటో లో ఇంటికి బయలు దేరాను. వచ్చిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ లో తొందరగా BP పెరగకుడా ఉండాలి అంటే ఆటో వాళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్న ధర్మ సుక్ష్మం తెలుసు కొన్నాను. మెయిన్ రోడ్ లోనే దిగి
కొంచం నడిచి ఊసురూ మంటూ ఇంటికి చేరాను. గేటు దగ్గర మా ఓనర్ కనపడితే, "బావున్నారా సార్ !! సార్ పొద్దున్నే నీళ్ళకి కొంచం కష్టం అవుతోంది అండీ. రాత్రిళ్ళు మోటర్ వెయ్యడం మర్చి పోవడం మర్చి పోకుండా ఉంటారా" అంటూ వీలు అయినంత నెమ్మదిగా చెప్పాను. దానికే అయన మొహం మాడ్చుకొని, "ఇప్పటికి మూడు సార్లు చెప్పారు అండీ మీ మిస్సేస్స్ గారు. మళ్లీ మీరు చెపుతున్నారు ఇప్పుడు" అంటూ స్కూటర్ లో అక్కడ నించి కదిలి వెళ్ళిపోయారు.

"ఛ ఛ !! ఎం మనుషులో ఏంటో !! పక్కవాడికి కనీసం విలువ కూడా ఉండదు" అనుకొంటూ లోపలికి చేరాను. ఈ సారి ఒక నిండు బకెట్ నీళ్ళతో స్నానం చేసి భోజనం చేస్తూ ఉంటే, "ఏమండి !! దొరికిన్దనుకొన్న పని మనిషి లాస్ట్ లో రానని చెప్పింది. కధ మళ్లీ మొదలుకి వచ్చింది. మళ్లీ వెతుకు లాట మొదలు పెట్టాలి" అనింది నా సతీమణి.

"ఏమండి !! కాకినాడ నించి transport వాళ్ళు పోగొట్టిన మన కుర్చీలు మరియు బీరువా తాలూకు డబ్బులు ఇవ్వడం కుదరదు అట. కావాలి అంటే వాళ్ళ కోచిన్ లో ఉన్న హెడ్ ఆఫీసు కి కంప్లెయిన్ చేసుకో మన్నారు", అంటూ బాడ్ న్యూస్ ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టింది మా ఆవిడ.

"అబ్బా !! ఈ దేశం లో కష్ట పడకుండా అసలు ఒక్క పని అయినా అవడం నా ఈ జన్మ లో చూస్తానా. ఎవడి పనులు వాడు సక్రమంగా పని చేస్తే జనం కి ఇన్ని కష్టాలు ఉంటాయా. అయినా వీళ్ళని అని లాభం లేదు, యధా రాజ తధా ప్రజా !! వాళ్ళే అలా ఉంటే మిగతా జనాలు ఏమి చేస్తారు" అని ఒక చిన్న సైజు lecture మా ఆవిడ కి దంచి ఇంక బాగా నిద్ర రావడం తో పడుకోవడానికి మంచం మీద వాలా. కొంచం నిద్ర పడుతోంది అన్న సమయం లో పొద్దున్న బ్యాంకు లో వాళ్ళ అమ్మ తో సహా నిలపడ్డ ఎకౌంటు ఓపెన్ చెయ్యడానికి వచ్చిన కుర్రాడు మరియు DD మార్పించడానికి వచ్చిన పెద్దాయన సడన్ గా నా కళ్ళ ముందర కన పడ్డారు. ఇబ్బంది కరమైన ఆలోచనలు పక్కకి తోసేసి పడుకోడానికి మళ్లీ ప్రయత్నం మొదలుపెట్టా.

Thursday, January 13, 2011

కాలనీ భోగి - 2

"వద్దురా బాబు. చచ్చి పోతాం. అసలు ఇప్పుడు రామవరప్పాడు వరకు ట్రాక్ అంటా శుబ్రం చేసారంట" అని నిరుత్సుహపరిచాను నేను. "అవున్రా మాఇంట్లో కిందటి సంవత్సరం వాయదీసారు. పట్టాలెంబడ మళ్లీ కన పడ్డాము అని తెలిసిందో ఇంకా అంతే" అన్నాడు హరి. "సరే రా. మరి మనం single quarters పక్కన ఉన్న కొమ్మలు కొట్టు కోద్దాం అయితే" అని సాయి త్వర పెట్టాడు. మొత్తం మేము ఒక పది మంది చేరి వెళ్ళే సరికి జయ గాడి బ్యాచ్ రక రకాల పరికరాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. కొంత కిరాతార్జునీయం జరిగిన తర్వాత మా కాలనీ జ్యూరీ వద్దకి వెళ్ళాం అందరు కలిసి. మా కాలనీ లో సాధారణముగా ఇలాంటి తగాదాలు తీర్చడానికి సెంటర్ లో బాబా కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర 24x7 కష్టమర్ సర్వీసు అందిస్తూ కొంత మంది కూర్చుని ఉండేవాళ్ళు. వాళ్ళు మా గొడవంతావిన్న తర్వాత సగం సగం తీసుకోమని తీర్పు ఇచ్చారు.



భోగి ఇంకా నాలుగు రోజులు ఉంది అనగా ఒక ఇద్దరు గ్యాంగ్ మాన్లు మా ఇంటి దగ్గర మాధ్యాన్నశుభ గడియల్లో ఒక శ్రేష్టమైన స్లీపెర్ ని మా ఇంటి దగ్గర పడేసి వెళ్ళేరు. మా బ్యాచ్ అంతా ఆ రోజు దాన్ని తాకి మరి తనువూ తీరా అస్వాదించాము. ఇంక నా సంగతి చెప్పక్కర్లేదు. మా లైన్ క్రికెట్ టీం కాప్టైన్ సాయి గాడు మర్నాటి మ్యాచ్ లో ఆల్రెడీ ఓపెనింగ్ బాటింగ్ confirm చేసేసాడు. ఇంతలో తాడికొండ లో చదివే మా అన్నయ్య సంక్రాంతి సెలవలకి ఇక్కడకి వచ్చాడు. వాడికి మా ఫ్రెండ్స్ కి మధ్య అంత సయోధ్యత ఉండేది కాదు. "సరే రా !! రేపు పొద్దున్నే గ్రౌండ్ లో కలుద్దాం అని వెళ్లి పోయారు" మా జనం అంతా. మా వాడికి అప్పట్లో కమ్యునిస్ట్ భావాలూ చాలా ఉండేవి. "అమ్మా !! ఇలా రైల్వే సొమ్ము ఈ భోగి మంటల్లో తగల పెట్టడం ఏమైనా బావుందాఅని తర్కం మొదలు పెట్టాడు. మా వాడు కాలనీ లో ఉండక పోవడం వల్ల మా prestige గురుంచి పెద్ద అవగాహన లేదు. వాడితో ఇలాంటి విషయాల్లో అనవసరంగా తల దూర్చ వద్దని వార్నింగ్ ఇచ్చి మా జనాలు తో మ్యాచ్ గురించి మాట్లాడడానికి హడావుడిగా వెళ్లి పోయాను.


మర్నాడు క్రికెట్ మ్యాచ్ తో తలమునకలు అయిపోయినంత బిజీ. అసలే బాల్ బేట్ మ్యాచ్. చివరకి వాళ్ళ లెగ్ umpire తొండి చెయ్యడంతో మ్యాచ్ కాన్సిల్ అయిపోయింది. గొడవ అవ్వడం తో మా జనాలు చాల సేపు చర్చ చేసాం. సాయంత్రం ఎప్పుడో ఈసురో మంటూ ఇంటికి చేరితే, మా వాడు తలుపు దగ్గరే స్వాగతం చెపుతూ వంకర నవ్వులు నవ్వుతు ఎదురు వచ్చాడు. ఏదో తేడాగా అనిపించి ఒక్కసారి గా ఇంటి వెనక్కి వెళ్లి స్లీపెర్ కోసం చూసాను. "ఇంకేముంది. గుండె గుభేల్మంది". అక్కడ స్లీపెర్ లేదు. "అమ్మా, అమ్మా !! స్లీపెర్ ఏది ?" అంటూ గావు కేకలు పెట్టాను. మా అక్కయ్య ఈ దుర్మార్గం చూడ లేనట్టు గా అక్కడ నించి మౌనంగా వెళ్లి పోయింది. మా వాడి నవ్వులు ఆగట్లేదు. "పాపం !! కాలనీ ఆంజనేయస్వామి గుడి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకోవాలి అట. పట్టుకు పోయార్రా", mystery విడతీసింది మా అమ్మ నింపాదిగా. "నాన్నగారే చెప్పారు. గుడి వాళ్ళు అడిగితే కాదనగలరా. ఇంకా 10-12 దాకా ఇస్తారు అట", మా వాడు పరమ సంతోషంగా చెప్పాడు. "అమ్మా !! ఏంటమ్మా. ఇంక రెండు రోజుల్లో భోగి. మీకు ఎవ్వరకి అర్ధం అవ్వడం లేదు", అంటూ కన్నిళ్ళని అతి కష్టం మీద అపుకొంటూ అరిచాను. "అసలు భోగి అంటే ఏమిటో తెలుసా ? ముందరి సంవత్సరం లోని చెత్త ని కాల్చేసి కొత్త వస్తువులు సంపాదించు కోవాలి అని. ఇట్లా మంటలు పందాలు వేసు కోమని కాదు", మా వాడి నోటికి అడ్డు ఆపు లేకుండా పోతోంది. ఇలాంటి వార్తలు ఎంత వేగంగా పాకి పోతాయి అంటే, ఒక గంట వ్యవధి లో మా బాచ్ ఒక్కరు ఒక్కరు గా వచ్చి నన్ను పిలవడం మొదలు పెట్టారు. సాయి గాడి చెయ్యి పట్టుకొని మరి "సారి" చెప్పాను. భోగి మంట మీద ఆశలు ఇంక వదిలేసాం.



నేను, సాయి గాడు మర్నాడు కొంచం ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టాము. "ఏమి చేస్తాము రా. నువ్వు ట్రై చేసావు. కుదరలేదు అంతే", అన్నాడు సాయి నిర్లిప్తంగా. వాడు అంత కూల్ గా react అవుతాడు అని నేను ఊహించలేదు. జయా గాడు సైకిల్ మీద మమ్మల్ని చూస్తూ వెకిలిగా నవ్వుతు వెళ్ళాడు. విషయం వాడికి తెలిసింది అన్నమాట. "ఇంక కాపలా ఎందుకు రా వేస్ట్" అన్నాను నేను. "లేదురా నేను, బ్లడ్ శీను, జిం మనోహర్, ఇంకో ఇద్దరు ఉంటాము లేరా" అన్నాడు సాయి. నాకు వాడు ఇంకా నా ఫ్రెండ్ గా ఉన్నందుకు "మా కాలనీ ఆంజనేయస్వామి" థాంక్స్ చెప్పుకుంటూ, ఏమైనా నిన్న తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని లెంపలు వేసుకొన్నాను.


మర్నాడు పొద్దున్నే నాలిగింటికి భోగి మంట మొదలు పెట్టాము. థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీ గా రెట్టించిన ఉత్సాహంతో అన్ని పేర్చుకోవడం మాకు కనిపిస్తూనే ఉంది. నాకు ఎలాగు మాది అయిదు ఇంటికి అయిపోతున్దిలే అని సాయి మరియు తదితరులు కు నా వంతు సహాయం అందిస్తూ ఉన్నాను. ఇంకా అన్ని అయిపోయాయి అని అనుకొంటుండగా, మా జనాలు ఎక్కడ నించో అప్పటివరకు ఉన్న దాని కంటే రెండింతలు తీసుకు వచ్చి రెడీ గా ఉన్నారు. మా భోగి మంటలు సమయాల్లో ప్రత్యర్ధి వర్గం నించి ఒకడు సదా గూడచారి తిరుగుతూ ఉంటాడు. నాకు అయితే ఆశ్చర్యం కి అంతు చిక్కట్లేదు. సాయి గాడు చిరునవ్వుతో పని కానిస్తున్నాడు. సర్లే మనం గెలుస్తున్నాము కదా ఎట్లాగు అని నేను కూడా పెద్ద ప్రశ్నలు వెయ్యలేదు. ఇలా థర్డ్ లైన్ వాళ్ళు ఆరు గంటలకే ముగిస్తే, మేము దిగ్విజయంగా కనీసం ఆరున్నర వరకు నడిపించాము. ఎనలేని సంతోషంతో అందరు చప్పట్లు, అరుపులు, కేరింతలు కొట్టుకొంటూ ఇళ్ళకి చేరాము.

మా అమ్మ, అన్నయ్య నేను చేరే సరికి విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు. "రౌడీ వెధవలు మితి మీరు పోతున్నారు కాలనీ లో", అంటూ మా అమ్మ తిట్ల పురాణం ఎత్తుకోంది. నెమ్మదిగా నాకు అసలు విషయం తెలిసింది ఒక గంట తర్వాత. మా ఇంటి వెనకాల ఫెన్సింగ్ లో కుడి పక్క భాగం, సాయి గాడి ఇంటి గేటు, హరి వాళ్ళ ఫెన్సింగ్ లో ఒక చెక్క దిమ్మ క్రితం రోజు రాత్రి ఎవరో కొట్టేసారట. మేమంతా "తెలు కుట్టిన దొంగలు" మయ్యాము అని మీకు వేరే చెప్పక్కర్లేదు అని అనుకొంటా.

Tuesday, January 11, 2011

కాలనీ భోగి - 1

"ఏంట్రా !! భోగి ఇంకా పది రోజులు. తెలుస్తోందా" అన్నాడు రామ కృష్ణ ఎండు గడ్డి పుల్లల్లో నించి పొగ పీలుస్తూ. "థర్డ్ లైన్ వాళ్ళు ఆల్రెడీ గా చాలా పోగేసారు" ఉప్పుందించాడు హరి గాడు. "ఏదో ఒకటి చెయ్యాలి రా !! లేకపోతె ఇంకా వేస్ట్ మనం" కొంచం విరక్తి గా అన్నాడు సాయి. "మరి నువ్వు ఏమంటావు సతీష్ గా, ఏమి మాట్లాడక పొతే ఎలా రా", రెట్టించాడు ఈ సారి.
"చూద్దాం లేరా, ఇంకా టైం ఉంది కదా" అంటూ తొందర గా ఈ టాపిక్ అయిపోతే బావుండు అని లేవ పోయాను నేను. "నీ అబ్బ !! నీకు పరిస్తితి అర్ధం కావడం లేదురా. లాస్ట్ భోగి మంటల్లో వాళ్ళే గెలిచారు. మన మంట కన్నా కనీసం ఒక గంట ఎక్కువ సేపు మండింది వాళ్ళది. నీకు సెకండ్ లైన్ పరువు ఏమి అయిన అర్ధం అవుతోందా" అని కొంచం గట్టి గానే అన్నాడు సాయి.
"మరి వాళ్ళ దగ్గర కాలనీ IOW (Inspector of Works) కొడుకు జయ గాడు ఉన్నాడు. వాళ్ళ నాన్న మరి వాళ్ళ ఆఫీసు నించి చాలా వరకు విరిగి పోయిన గేట్స్, కాలనీ లో పోగు అయిన చెక్క అంతా వాళ్ళకే ఇస్తాడు. పెద్ద మంట అయ్యింది అంటే అవ్వదా " అంటూ ధర్మ సూక్ష్మం వివరించాడు హరి.
"క్రితం సంవత్సరం ట్రాక్ పక్కన తుమ్మలతో చాలానే పోగేసాం కదరా. లాస్ట్ లో సతీష్ గాడు ఇప్పిస్తా అన్న స్లీపెర్ కట్టె వచ్చుంటే మన దే సూపర్ అయ్యేది. సుడి లేదురా మనకి" అన్నాడు నిర్లిప్తంగా సాయి . ఏది అయితే ఎవ్వడు మాట్లాడకూడదు అని అనుకొన్నాడో అదే మళ్లీ మధ్యలోకి వచ్చి పడింది. నేను ఇబ్బంది గా కదుల్తు "అరె ఏమి చెయ్యనురా, అప్పటికి ట్రై చేశాను కదరా". అంటూ దీనంగా అన్నాడు. "సర్లే రా, సాయంత్రం నించి మొదలు పెడదాం. అస్సలు ఏమి చెయ్యకుండా ఉండము కదా" అని అక్కడ నించి అందరు కదిలారు.
విజయవాడ లోని సత్యనారాయణ పురం రైల్వే కాలనీ లో భోగి మంటలు అంటే అది ఒక వరల్డ్ కప్ పోటి లాగా జరుగు తుంది. కాలనీ లో ప్రతి లైన్ లో కనీసం 30-35 quarters ఉంటాయి. ఈ లైన్ ల మధ్యల్లో క్రికెట్ మ్యాచ్ పోటీలు, కొట్లాటలు, రాయభారాలు అన్నీ వీర లెవెల్ లో ఉండేవి. ఇంకా భోగి పండగ అప్పుడు మా కాలనీ లో మాత్రమే ఒక విచిత్రమైన పోటి ఉండేది. ఎలా మొదలు అయ్యిందో ఏమో కానీ, ఒక లైన్ వాళ్ళు వేసిన భోగి మంట పక్క లైన్ వాళ్ళ మంట కంటే పెద్దగా మరియు ఎక్కువ సేపు ఉంటె వాళ్ళు ఇక కాలర్ ఎగర వేసి తిరగ దానికి free license వచ్చిన్దన్నమాటే. దీని కోసం జనం దగ్గర ఉన్న చెక్క సామానులు, కాలనీ లో పెరిగిన పిచ్చి చెట్లు, ట్రాక్ వెంబడి ఉన్న తుమ్మ పొదలు ఇలా అన్ని రకాల సామాగ్రి కోసం చాల డిమాండ్ ఉండేది. మా లైన్ లో ఆడపిల్లలు భోగి మంట బాగా పెద్దగా వస్తే మమ్మల్ని చూసే అదో రకం చూపుల తో మా జన్మ తరించేది. పైగా నాకు ఈ సీజన్లో లో ఒక స్పెషల్ స్టేటస్ ఉండేది. మా నాన్నగారు రైల్వే లో PWI (track inspector) ఉద్యోగం లో ఉండే వారు. ఆ మధ్య కాలంలో విజయవాడ డివిజన్ లో అంత బ్రిటిష్ వాళ్ళు వేయించిన రైల్వే ట్రాక్స్ లో చెక్క స్లీపెర్ లు తీసేసి సిమెంట్ స్లాబ్ స్లీపెర్లు వేసే ప్రాజెక్ట్ వర్క్స్ జరిగేవి. దాంతో ఈ చెక్క స్లీపెర్లు చాల వరకు అవతల పారేయడం లేదా auction లో అమ్మేయడం చేసే వాళ్ళు. మా నాన్నగారు ట్రాక్ ఇన్స్పెక్టర్ కావడంతో అడపా తడప కాలనీ లో వాళ్ళు వాళ్ళ quarter కి ఫెన్సింగ్ లేదా ఇంటికి గేటు వేయించు కొంటామంటే అయన లోపాయికారీ గా వాళ్ళ కి సహాయ పడే వాళ్ళు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేయించిన స్లీపెర్ కట్టెలు కావడం తో చాల నాణ్యంగా చాల సేపు మంచి మంట ని ఇస్తూ కాలేవి ఇవి. ప్రపంచం లో అందరకి స్లీపెర్ లు మా నాన్నగారు sanction చేసే వాళ్ళు కానీ మా లైన్ పరువు గురించి అయన ఎ మాత్రం ఖాతరు చేసే వాళ్ళు కాదు. మా లైన్ లో seniors భోగి ని organize చేసే అప్పుడు ఎప్పుడు మాదే పై చేయి. ఒక రెండు భోగి పండగల క్రితం కాలనీ లోకి మేము కొత్తగా రావడం, మా నాన్నగారు ఏదో మూడ్ లో కుర్రాళ్ళు ముచ్చట పడటం చూసి ఒక స్లీపెర్ కట్టి ఇవ్వడం, మా భోగి మంట కాలనీ మొత్తానికే పెద్దది అవ్వడం తో నా లెవెల్ చాలా విపరీతంగా పెరిగి పోయింది. కానీ తర్వాత ఇది ఏదో అయన ఉద్యోగానికే ఎసరు పెట్టేది గ అని అనిపించిందో ఏమో, మా నాన్నగారు ససేమిరా అన్నారు. మా టీం అంత ట్రాక్ వెంబడి పడుతూ లేస్తూ తుమ్మ మొక్కలు, ఇంకా రకరకాల చెక్క సరుకు పోగు చేసినా కూడా థర్డ్ లైన్ వాళ్ళ కాలి గోటి కి కూడా సరి పోలేదు. మా ఓటమికి మిగతా కారణాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి కొంచం కండ పుష్తి ఉన్న వాళ్ళు మా బలగం లో నించి ఇంజనీరింగ్ లో సీట్ రావడమో లేదా transfer అయ్యి వేరే ఊరు వెళ్లి పోవడమో జరిగాయి. ఇంకా చివరి నిమిషంలో మా భోగి మంట సామాన్లు కొన్ని మా రక్షణ లోపించడంతో తగ్గడం, మంట జరిగే సమయంలో ఒక strategy లేకుండా సరుకు వెయ్యడం ఇలాంటివి. కానీ ఇన్ని కారణాలు ని తుంగలోకి నెట్టి వేసి సంవత్సరం పొడుగూత సతీష్ గాడు ఇస్తా అన్న స్లీపెర్ ఇవ్వక పోవడం వల్లే మా లైన్ పరువు గంగలో కలిసింది అన్న మాట నిలిచి పోయింది.

ఈ సంవత్సరం ఎలా అయినా స్లీపెర్ సంపాదించాలి అన్న పట్టుదలతో మా నాన్నగారి దగ్గర ఈ విషయం ప్రతిపాదించా. అయన ఏ కళ మీద ఉన్నారో కానీ "చూద్దాం లేరా" అని అన్నారు. కానీ షరా మాములుగా వచ్చే సంవత్సరం పదో తరగతి. ఈ వేషాలు అన్ని మానేయాలి మరి అంటూ హెచ్చరించారు. అదే పదివేలు అని అనుకోని మా జనాలు అందరు దగ్గర పని అయిపోయినంత build-up ఇచ్చా. సాయి గాడి ఆనందం అంతా ఇంతా కాదు. ఉబ్బి తబ్బిబ్బు అయి పోయి స్పెషల్ shake హ్యాండ్ ఇచ్చాడు. హరి గాడు ఇంక చెప్పక్కర్లేదు. రామ కృష్ణ అయితే సంతోషించాడు కానీ చివర్లో "అరె !! గారంటీ ఏనా" అంటూ చిన్న డౌట్ వేలిపుచ్చాడు. "మదర్ ప్రామిస్" రా ఇస్తా అన్నారు అని మల్లి భరోసా ఇచ్చా. "అయినా కానీ మనం కొంచం సంపాదిద్దాము రా. మొన్న తుఫాన్ కి single quarters పక్కన ఉన్న చెట్టు పడి పోయింది కదా. ఇంకా కొన్ని కొమ్మలు అలాగే ఉన్నాయి. జయ గాడు వాళ్ళు వెళ్ళే లోపే మనం వెళ్లి ముక్కలు చేసి పట్టుకు వద్దాము" అని నూతన ఉత్షాహం తో చెప్పాడు సాయి. "అరె !! ఈ సారి భోగి ముందర రాత్రి ఎవ్వరు నిద్ర పోకూడదు. దొంగ నాయాళ్ళు రా వాళ్ళు. మనం కాపలా కాయక పొతే ఇంక అంతే, తెలుసా" అని హెచ్చరించాడు హరి. "ఆల్రెడీ గ మన దగ్గర బానే ఉన్నాయి రా. మళ్లీ ట్రాక్ వెంబడి వెళ్ళాలి అంటావా" అడిగాడు రామ కృష్ణ.
-- సశేషం

Sunday, January 9, 2011

Sorry Sir

సారీ సార్ !!


"Good Morning Sir, How can I help you?" అంటూ అత్యంత సన్నిహితంగా King Fisher Airlines employee మా కుటుంబాన్ని సాదరంగా తిరుపతి విమనాశ్రయములొ ఆహ్వానించింది. మా చిన్నవాడి మొదటి సంవత్సరం నిండా గానే పుట్టు వెంట్రుకలు Pittsburgh వెంకటేశ్వర స్వామి గుడి లో ఇచ్చినా, మా కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి, కొండ మీద తప్పని సరిగా Foreign Barber Shop లో కాపాడుకొన్నవి మరియు మళ్లీ వచ్చినవి అన్నీ కలిపి శ్రీవారికి సమర్పించి గోవిందాకితమైన మనస్సులతో తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి విమాశ్రయం చేరామ్. "Your boarding pass Sir, Have a nice flight" అంటూ చిరునవ్వుతో బ్యాగేజ్ ట్యాగ్స్ తో సహా చేతికి టికెట్స్ ఇచ్చింది, ఇంగ్లీష్ లో మాట్లాడే ఒక తెలుగు అమ్మాయి. భారత దేశంలో స్త్రీ ని గౌరవించే సాంప్రదాయంని మా ఆవిడ ఎంతలా ఉపయోగించుకుంటుంది అంటే, కనీసం లైన్ లో నిల్చోకుండా "నేను రావాలా" అంటూ దగ్గరలో ఉన్న కుర్చీ లో నించి సైగ చేసింది. పిల్లలు ఉన్నారన్న సెంటిమెంట్ బాగా పనిచేసి "Not needed Sir" అంటూ అంత దూరంనించే ID-Check చేసేసి చక చక పని కానిచ్చేసింది మా King Fisher ఫ్రెండ్.


మమ్మల్నిAirport దగ్గర దించిన టాక్సీ అబ్బాయి దార్లోనే దట్టంగా కమ్మిన మబ్బులిని గమనించి "దిగుతుందా సామీ, ఇమానం?" అంటూ సందేహం వ్యక్త పరిచాడు. చాలా దేశాలు మీదుగా విమానాల్లో తిరిగిన అంతర్జాతీయత అనుభవం అంతా ఉపయోగించి చాలా క్లుప్తంగా "అట్లా ఏమీ ఉండదు, సూపర్ గా విమానాలు దిగుతాయి" అని బదులు ఇచ్చాను, ఒక్క గంట క్రితం. హైద్రాబాద్ నించి తిరుపతి వచ్చే విమానం దిగిన తర్వాత మళ్లీ అదే దాన్లోనే తిరుపతి నిండి వెళ్లే వాళ్ళు వెళ్తారు. చదువుకొన్న వాడి కంటే చాకలి వాడు మేలు అన్న సామెత ని నిజం చేస్తూ, "Due to poor visibility conditions the flight from Hyderabad is unable to land on time. Expected delay timeis 15 minutes. Sorry for the inconvinience" అంటూ announcement వినపడింది. ఆ వార్తని ధృవీకరిస్తూ మరో 10 నిమిషాలు తర్వాత King Fisher అధికారి ఒకాయన ప్రయాణికుల లాం జ్ లోకి వచ్చి మళ్లీ అదే వార్త ని చిరునవ్వు తో చదివాడు. "weather is bad. Sorry" అంటూ జాలిగా చూస్తూ నిలబడ్డాడు.


ఒక 10 మంది ఔత్సాహికులు ఆయన్ని చుట్టుమిట్టి విశ్రుతంగా ప్రశ్నల వర్షం మొదలు పెట్టారు.
ప్రయాణీకుడు 1: Is flight still in air ?
King Fisher: Yes Sir. The pilot is trying his best to land the flight sir.
ప్ర 2: Ooh !! The flight still in Air ? How long it can stay like that ?
KF: Not sure sir but we are trying our best sir.
ప్ర 3: Do you know if the weather is going to improve ?
KF: Not sure sir. Sorry sir.
ప్ర 4: How come the flights can not land now when its cloudy. How they are managing in night times.
KF: Sir. There are night operations here sir. Tirupathi is a small airport which has no feclities to land the flights in the poor visibility conditions.
ప్ర 5: Can you not take us to Chennai and fly us form there ? (ఈ ప్రశ్న వినగానే నా గుండెల్లో రాయి పడింది. చెన్నై వెళ్తే "ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాదండి, కొంచం shopping ఆది చేసుకొని వెళ్దాం" అనే మా ఆవిడ మొహం గుర్తు వచ్చి.)
KF: I will get back to you sir. Give me five minutes.
అంటూ "బ్రతుకు జీవుడా" అని అనుకొంటూ అక్కడ నించి జారుకొన్నాడు. నాకు నెమ్మదిగా వాతావరణ ప్రభావాలు కూడా Airlines వాళ్ళ అసమర్ధత గా ఆపాదించ వచ్చు అన్న నిజం అవగాహన లోకి రావడం మొదలు అయ్యింది. Flash back లో ఇలాంటి పరిస్థితులలొ విజయగర్వంతోAirport staff "you lost all your rights" అనే తెల్ల మొహాలు గుర్తుకు వచ్చి ఒక్క సారి ఒళ్ళు గగుర్పొడించింది. ఒక్క 15 నిమిషాలు తర్వాత మళ్లీ దీన వదానాలతో ఇందాక వచ్చినాయాన ఇంకో ఇద్దరు ని వెంట పెట్టుకొని లాంజ్ లోకి ప్రవేశించారు. మళ్లీ ప్రశ్నలు ప్రిపేర్ అయి ఉన్నారు ఏమో పెద్దగా టైమ్ వేస్ట్ చెయ్యకుండా మళ్లీ కొంత మంది వాళ్ళు చుట్టూ మూగారు.


ప్ర 1: What is the status ?
KF: Sir, the flight from hyderabad has been diverted to chennai and will arrive in Tirupathy once the weather improves Sir. Sorryfor the inconvinience Sir.
ప్ర 2: My good ness. I have a connecting flight to Mumbai. I have to catch the flight at any cost. Can you pursue the option of taking us to Chennai ? (నాకు ఈ వ్యక్తి ని ఏదో ఒకటి చేసి ఇక్కడ నించి తీసుకెళ్ళి పోతే బావుంటుందేమో అని అనిపించింది.)
KF:(అందరినీ ఉద్దేశిస్తూ) Your attention please. Any one having connecting flight to catch అంటూ బిగ్గరగా అరిచాడు. జనమధ్యం లో నించి ఆశగా చూస్తూ ఒకాయన "Yes" అంటూ బోర్డింగ్ పాస్ పట్టుకొని ఆయన్ని చేరాడు. "I have to go to Mangalore" అనిఅంటూ చుట్టూ ఉన్న వాళ్ళని ఏమిటి మీ nuicense అన్నట్టు చూశాడు.
KF: What time is your flight sir ?
Magalore: 2:00 pm KF: 2:00 pm ? Then wait here sir. No problem అని ముంబై ఆయన్ని బ్రతిమాలే పని మీద తన శక్తులు అన్నీ ఒడ్దడానికి ఉద్యుక్తుడుఅయ్యాడు.
ప్ర౩: (ఈయన ప్రవాసాంధ్రుడు) Excuse me sir. In the case of of flight not making to Tirupathy, what is the alternative ?
KF: Sir, we will arrange alternative sir. Definitely sir. Sorry for the inconvinience sir. ప్రవాసాంధ్రుడు: Exactly !! What its going to be ?
KF: Sir, weather is improving sir. There will be no problem sir. (ఆయన ఒక్క దీర్ఘ నిట్టూర్పు చుట్టూ పక్కల వాళ్ళకి కూడా వినపడింది.)
KF: Sir, we will arrange alternative sir. We will fly every one in Indian Airlines flight which is scheduled at 1:30 pm sir. అయ్యో అప్పుడే అయిపోయిందా అని అనిపిచ్చింది నాకు. కానీ వీళ్ళ విమానంకి ఉన్న ప్రాబ్లమ్ మరి Indian Airlines వాళ్ళకి ఉండదా ? ఇంకా అందరినీ ఆ flight లో పట్టించగలరా ? ఇలా ప్రశ్నలు నా మనస్సు లో ఉదయించినా, ప్రవాసాంధ్రుడు ఏమీ మాట్లాడక పోయే టప్పటికి నాకు ఎందుకులే మౌనంగా ఉంది పోయాను .ఇప్పుడు అసలు అయిన ప్రశ్న ఒక మూల నించి వచ్చింది. "Are you not going to provide break fast and coffee ?" అని.


KF: We will try our best sir. Just give us 10 minutes sir. మళ్ళీ ఈ ప్రశ్న ని అడిగిన వారికి కృతజ్ఞతలు మనస్సు లోనే తెలుపుతూ వాళ్ళు బయట పడ్దారు. కొంత సేపు అయిన తర్వాత ఇంగ్లీష్ లో మరియు తెలుగు భాషల్లో ఇంకో ప్రకటన వినపడినది. "Due to bad weather, the flight from Tirupathy and Hyderabad is delayed. King Fisher passengers will be provided with break fast. Please proceed to Airport Canteen". మగ పెళ్లి వాళ్ళు విడిది నించి కదిలి నట్టు గా అందరు కొంచం హడావుడి గా కాంటీన్ వైపు వెల్ల సాగారు. ఇంతలో దీనికి అంత మూల కారణం అయిన ప్రయాణికుడు, Airlines సిబ్బంది కనపడితే "Are you not going to provide coffee" అంటూ చాలా అప్‌సెటింగ్ గా అడిగాడు. అప్పటికే బిక్కచచ్చి ఉన్న ఆయన "Certainly Sir" అంటూ బదులు ఇచ్చాడు.OK. The announce did not mention about coffee" అని రుసరుసలడాడు. మీరందరూ ఊహించిన విధంగానే ఆయన "Extremely Sorry Sir" అంటూ బదులు ఇచ్చాడు.


ఒక అయిదారుగురు King Fisher వాళ్ళు క్యాంటీన్ దగ్గర నిల్చోని విడిది కి విచ్చేసిన పెద్దలకు ఏమీ కావాలో అడిగి మరి మేపడం మొదలు పెట్టారు. ఇంతలో ఇన్దాకటి కాఫీ లవర్ కొత్తగా Pringles కావాలన్న మనస్సులు ఉన్న కోర్కె ని వేలి పుచ్చాడు. "సార్. ఆది 150/- సార్". అంటూ బేలగా. వంకరగా నవ్వి ఆయన "తప్పదు" అన్న expression ఇచ్చాడు మన కాఫీ లవర్. ఓటమి అంగీకరించి ఒక pringles డబ్బా ని అందిచాడు, కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ స్టాఫ్ కుర్రాడు.


ఈ జనాభా ని ఒక గంట పాటు మేపిన తర్వాత మొత్తానికి చెన్నై కి మళ్ళిన విమానం తిరుపతి కి వస్తోంది అన్న శుభ వార్త దావనలమ్లా ఏర్‌పోర్ట్ అంత పాకింది. క్యాంటీన్ వాళ్ళు తప్ప మిగతా అందరు హర్షం వ్యక్తపరిచారు. (కాఫీ లవర్ ని గమనించలేదు). ఇంతలో నా ఇండియా మొబైల్ నంబర్ కి మా నాన్నగారు ఫోన్ చేసి "ఏరా !! తిరుపతి అంతా మేఘ వృతం - విమానాల రాక పోకలకి తీవ్ర అంతరాయాం అని టీవీ-9 లో స్క్రోలింగ్ వస్తోంది. ఏమీ అయ్యింది ?" అని అదుర్ధా గా అడిగారు. విషయం అంతా ఎక్స్‌ప్లేన్ చేసి మేము హైద్రాబాద్ చేరే వరకు టీవీ-9, టీవీ-5, టీవీ-1 వగైరా చ్యానెల్స్ చూడొద్దూ అని గట్టిగా చెప్పాను.


చివరగా మరోసారి KF వచ్చి కాపాడిన వారికి సారీ చెపుతూ ఉంటే ఇక ఉండబట్ట లేక అడిగాను. "ఏమండీ !! ఈ వెదర్ ప్రాబ్లమ్ ని మీరు సృస్టించారా ?" అని. "No Sir. Certainly No Sir" అంటూ బదులు ఇచ్చాడు ఆయన. "మరి సారీ అరిగే దాకా సారీ ఎందుకు చెప్తున్నారు అండీ" అని మళ్లీ అడిగా. "people do not understand sir. thats why we tell sorry sir" అని ఇక వెళ్ళరా అన్నట్టు గా చూసాడు అతను.


(ఈ మధ్య ఇండియా ప్రయాణం లో ఎదురు అయిన సంఘటన. ఎందుకో తెలియదు కానీ ప్రయాణీకుల స్తోమత ని గుర్తుఏరిగి కస్టమర్ సర్విస్ అందిస్తున్నారు అన్న నిజం తెలిసింది. మామూలు బస్సుల్లో లేక ట్రేన్స్ లో ఎవడు ఏమీ పట్టించు కోడు కానీ ఇలా కొంచం డబ్బు ఖర్చు పెట్టిన వాడికి అన్వరసమైన మర్యాద. పైగా చాలా మందికి ఈ ప్రపంచం లో తమకి తెలియని విషయం లేదు, అన్న విషయం ఈ సంధర్భాలు లో గమనించ వచ్చు.)