Showing posts with label Cinema. Show all posts
Showing posts with label Cinema. Show all posts

Sunday, January 30, 2011

నటన రాని అగ్ర నటులు

వాచకము, విగ్రహము, ఉచ్చారణ, హావ భావాలూ ఇవేవి లేక పోవడం ఈ రోజున తెలుగు సినిమాలలో అగ్ర నటివర్గం గా చలామణి అవుతున్న వారి యొక్క ముఖ్య అర్హతలు. వాళ్ళ నాన్న, మామ, పెదనాన్న లేక బాబాయ్ ఇలా ఎవరో ఒకరి రక్తం వీళ్ళ ఒంట్లో వుంటే చాలట వీళ్ళు కూడా మహా నటుల జాబితా లో ఇట్టే చేరి పోతారు. కాని ఈ "వా" (వారసత్వం) బ్లడ్ గ్రూప్ ఒక్క తెలుగు హీరో కులానికే వర్తిస్తుంది అట. వీధి లోకి కొత్త కుక్క వస్తే ఎలా అయితే అది నిర్దయగా తరమపడుతుందో, ఈ కుల సంతతి ఈ "హీరో" ఇజంని తమ జన్మ హక్కు గా బావిస్తుంది. ఈ హీరో వర్గం ఒక్క బాధ్యత వట్టి సినిమా లో నటించడం మాత్రమే అని అనుకొంటే మీరు పొరపాటు పడినట్టే. ఉదహరణకి వీళ్ళ సినిమాలు లో పాటించవలసిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే.
  • సినిమా లో ముఖ్య నటి నట వర్గం ని మొత్తం మీద హీరో నే నిర్ణయిస్తాడు.
  • హీరో యొక్క సామర్ధ్యం ని బట్టి, అతని కన్నా నటన కొంచం అయినా వచ్చిన వాళ్ళని చిన్న చిన్న పాత్రలకి లేక తమ ని ఇంకా ఎలివేట్ పద్ధతి లో తగిన జాగ్రత్త డైరెక్టర్ తో సహా కలిసి తీసుకొంటారు.
  • అన్నిటి కన్నా ముఖ్యంగా హీరోయిన్ తెలుగు మాట్లాడం రాని అమ్మాయి అవ్వాలి. చెప్పా కదా మన హీరో గారు ముందర ఎక్కువ నిడివి లో కనిపించే వాళ్ళు నటన తప్ప మిగతా అన్నిటిలో సమర్ధులు అయ్యి ఉండాలి అని.
  • ఒక్క కమెడియన్ తప్ప మిగతా ఆర్టిస్ట్లు అందరు పక్క రాష్ట్రాలు వాళ్ళు అయి ఉండాలి.
  • డబ్బులు పెట్టె నిర్మాత ఒక పెద్ద supplier మాత్రంగా మిగిలి ఉండాలి.
  • హీరో గారి కి ఇష్టమైన ప్రదేశాల్లో పాటల చిత్రీకరణ జరిగే విధం గా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక్క పేరుపడ్డ హీరో వర్గీయులు అవ్వడం వలన వీళ్ళకి పెక్కు లాభాలు. మొదటగా వేషాలు కోసం ఎవడి కాళ్ళు పట్టుకోవక్కర లేదు. కను ముక్కు తీరు ఎలా ఉన్నా తిమ్మి ని బొమ్మి ని చేసి వీళ్ళ మొహాలు సరి చేస్తారు. సినిమా చతికిల పడినా కూడా తర్వాతి సినిమాల్లో వేషాలకి డోకా ఉండదు. వీళ్ళకి నటనకి సంభందించిన నైపుణ్యం ఏమి లేక పోయినా కూడా డైరెక్టర్ ప్రతిభతో మరియు గ్రాఫిక్స్ వగైరా లతో సినిమాల్లో ఒక్కింత ఎక్కువగా చూపిస్తారు. మొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ తన చిన్న వయస్సు లోనే వట్టి కనుబొమ్మలతోనే  ఆందోళన నించి ఆనందం హావభావాలు ఎలా మార్చవచ్చో మహానటి సావిత్రి గారు నేర్పింది అట. చాదస్తం కాక పొతే అవన్నీ ఎందుకు అండి సినిమా హిట్ అవ్వాలి అంటే ? సినిమాల్లో డబ్బులు రావాలి అంటే మంచి కధ, direction, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మంచి నటీ నట వర్గం... ఎవడండీ మీకు చెప్పింది ఇవన్నీ. మంచిగా ప్రింట్లు వేయించుకొని ధియేటర్ లు బ్లాక్ చేయించు కోగలిగితే సరిపోదూ !! జనాలు చచ్చి నట్టు వస్తారు అండి.

Wednesday, January 26, 2011

పింగళి వారు

"రసపట్టులో తర్కం కూడదు" అంటూ మాయాబజార్ కృష్ణుడు మందస్మితుడై రుక్మిణి దేవి తో చిలిపిగా అన్నప్పుడు మా దుర్గా కళా మందిరంలో సంతోషం తో కూడిన కలకలం నాకు ఇంకా కళ్ళకి కట్టినట్టు గా గుర్తు ఉంది. పింగళి వారి మాటలు ఒక ఋషి పలుకులు లాగా, మెరుగైన శిల్పానికి మల్లె ఇంకా కొత్త గా ప్రజానీకం మనస్సుల్లో కదలాడుతూనే ఉన్నాయి. మచ్చుక్కి కొన్నిటిని (నాకు గుర్తు ఉన్నంత వరకు) స్ప్రుసిస్తాను

ముందుగా ఒక్క మాయబజార్ లోనే వాడిన వాక్య నిర్మాణం సరి కొత్త నిఘంటువు కి మల్లె ఇంకా తన సేవలు అందిస్తూనే ఉంది.
"ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి" అని రహస్యం భేదిస్తాడు ఘటోద్గజుడు.
"శశిరేఖ కనికట్టు ఏమైనా నేర్చిందా లేక నా కన్ను ఏమైనా చెదిరిందా" పాచిక పారని శకుని మామ.
"పండితులు అంటూ సుద్ద మొద్దులు తయారు అయ్యారు" అంటూ ఎద్దేవా.
"భళి భళి భళి ఓ దేవా !! బాగున్నదయా నీ మాయ" అన్న జానపద తత్త్వం.
"ఇదిగో శశి, నీ బావ సత్యవంతుడై వచ్చాడు" అంటూ అభిమన్యుడిని ఉద్దేశిస్తూ కృష్ణుడు జరగబోయే పరిణామాలు చెప్పబోతే "అయితే మా శశి సావిత్రి అవుతుంది లెండి" అంటూ రుక్మిణి వారిస్తుంది.
"లక్ష శని గ్రహాల పెట్టు మా శకుని మామ" అంటూ అతని కుటిలత్వాన్ని ఒక్క మాట తోనే తేల్చుతాడు కృష్ణుడు. "బాల కుమారులంట, చాలా సుకుమారులంట, పెళ్ళికొడుకు నన్ను చూసి , మురిసి మూర్చ పోవునంట" అన్న మన సావిత్రి.
మరి "అస్మదీయులకు విరుగుడు తస్మదీయులు" అన్న ప్రయోగం, ఆశ్చర్యానికి "ఆసచర్యం" అనిపించడం, "ఆ నీటు గోటు" ఇలా ఎన్నో !!

జగదేక వీరుని కధ లోని ఇంద్రకుమారి తన సఖులని "హల" అని సంభోదించడం చూస్తే దేవలోకం లో ఈయన కొన్నాళ్ళు అక్కడ నివాసం చేసారా అని అనిపిస్తుంది. అట్లాగే మూడు లోకాలు ని పాలించే అమ్మని "జేజి" అని పిలవడం ఆయనకే చెల్లింది. "వరించి వచ్చిన మానవ వీరుడు ఏమయ్యాడని విచారమా" అంటూ ఇంద్ర కుమారి ని ఆట పట్టించడం అతికి నట్టు సరిపోతుంది.

అలాగే మిస్సమ్మ లో "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అన్నప్పుడు స్త్రీ హృదయం ఈయన ఒక్కడికే అర్ధం అయ్యిందా అని అనిపించక మానదు. "చూస్తారా నా conduct certificate" అని NTR అడిగినప్పుడు ఇప్పటికి చూసే వారు పక్కున నవ్వుతారు. "తన మతమేదో తనది, మన మతమసలే తగదోయ్" అన్నప్పుడు చంద్రుడిని ఎలా మన హీరో కలుపు కొన్నాడో చర్చ కొన్నాళ్ళు జరగాల్సిందే. SVR "అదే" అని పదే పదే అనడం ఊత పదం నించి సరసమైన హాస్యం ని పుట్టిస్తారు.

"నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా" చేతులు కట్టుకొని మన NTR అడగడం, "సాహసం సేయరా డింబకా, రాజ కుమారి లభిస్తుంది" కుటిల ప్రోత్సాహం చూపే నేపాలి మాంత్రికుడు. ఇవన్నీచేరి ఈరోజుకి రాజ మౌళి వంటి డైరెక్టర్ లని మళ్లీ తీద్దామా అని అనిపిస్తోంది.

ఈయన నాగుపాము కుబుసం విడిచి నట్టుగా ఒక సినిమా లో వాడిన ప్రయోగాల కనీసపు వాసన కూడా మరో వాటిల్లో రాకుండా పడిన జాగ్రత్త చూస్తే ఇవ్వాల్టి వాళ్ళ దివాలా కోరు తనం కనపడుతుంది. ఉదాహరణ కి గాయం సినిమా లో హిట్ అయ్యిన డైలాగ్ లు హిందీ సత్య లో వినపడితే "అయ్యో" అని అనిపించక మానదు.
అటువంటి మహానుభావుణ్ణి మళ్లీ తలుచుకొనే ప్రయత్నం ని హర్షిస్తారు అని భావిస్తున్నాను.