నా అభిప్రాయలు, నా ఇష్టం అని అనుకొన్నప్పుడు పదిమందికి నీ విషయం తెలియాలి అని తాపత్రయం ఎందుకు ? నీకు కలిగిన భావనలు అందరికి తో పంచేసుకోవాలి అన్న ఆదుర్దా ఎంచేతా ? ఒక వేళ అది రెండో వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తోందని అనిపించినా, నా యొక్క విలువైన ఆలోచనలు చెప్పే తీరుతాను అని అనే మహానుభావులుని ఏమని అనాలి ?
చాలా మంది "నన్ను అడిగితే సార్" అని మొదలు పెడతారు కాని అడిగే దాక ఆగే మర్యాద లేదా శ్రద్ధ వహించరు.అవతల వాళ్ళు అడిగినా అడగక పోయినా తోచింది చెప్పక మానరు. ఈ రోజుల్లో సోషల్ వెబ్ సైట్స్ లో తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలూ తెలియ పరచడం సర్వ సాధారణం అయ్యింది. దీని వలన మంచి లేదా చెడు ఎంతో చెప్పేటంత గొప్ప వాడిని కాకా పోయినా, ఒక సహజమైన సందర్భాన్ని పరిశీలిద్దాము. మనము అందరు ఏదైనా వార్తలు చదివినా లేక చూసినా ఏ విధంగా స్పందిస్తాము ? లేదా ఎవరు అయినా మీతో ఒక విషయం మీద చర్చ చేసినా సరే. దాని తాలూకు ప్రభావం ఎంతో కొంత అవతలి వారిపై ఉంటుంది అన్న సత్యం నిర్ద్వందం. కాగ నిష్పత్తి మారొచ్చు.

ఎందుకండీ ఇంత ఆందోళన ? ఏమి అవుతుందండి ? ఒక సారి వింటారు, రెండో సారి వినీ విన్నట్టు ఉంటారు, తర్వాత నించి వినడం మానేస్తారు కదా !! ఏదో చేస్తూ, మరేదో ఆలోచిస్తూ వంట పట్టించుకొనే వాటితో మనకి ఎటువంటి ప్రమాదం లేదనుకోండి.ఉదాహరణకి శ్రీ రామ నవమి నాడు మన దర్శక రత్నం రామ గోపాలుడు తన ప్రేలాపాలు అన్నీ త్విట్టేర్ ప్రవేశింప చేసి యువ జనావళి ని ఆలోచించ చేసాను అని సంతృప్తి పడ్డాడట. "వేయి వృక్షాలు" కాదు "విష వృక్షాలు" ప్రశస్తం అని నొక్కి వోక్కా నించాడు. అదేమన్నా అంటే భావ, వాఖ్ స్వాతంత్రం అని అంటారు మరి. మరి ఈ సమాజం లో సదరు ప్రముఖులు అంతా వాళ్ళకి ఇష్తం వచ్చినట్టు వారి వారి భావ జాలాన్ని ప్రదర్శిస్తే ఏమీ తప్పు లేదా ?
ఎవరి గురుంచి అయినా చెడు చెప్పడం ఎంత లోకండి ? రోడ్డున పోయే కుక్కలు కూడా మొరుగు తాయి. దేవుడయితే మరీ ఈజీ ? దిక్కు మొక్కు లేని వాడు కదా ? నేను పదమూడు ఏళ్ళ వయస్సు లో ఇండోర్ కి రైల్ లో వెళ్తూ "రంగ నాయకమ్మ విష వృక్షాలు" ఎదురు కూర్చున్న అయన దగ్గర అరువుచ్చుకొని చదివిన విషయాలు ఇప్పటికి కొన్ని జ్ఞాపకానికి ఉన్నాయంటే కొన్ని సంగతులు చెప్పకనే చెప్పబడతాఎమో. విజ్ఞులు ఆలోచించండి. ఈ రోజున సమాచారం ని లక్షల, కోట్ల మందికి చేరవేసే సాధనాలు ఉన్నాయని ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఇష్టానికి ప్రవర్తించ వచ్చా ?

నిన్న రాత్రి నిద్ర బాగా పట్టిందండి !!మా వీధి చివర కుక్క బాగా మొరుగుతోందండి !!మా కార్ లో ఈ రోజు గ్యాస్ కొట్టిన్చానండినాకు గళ్ళ చొక్కా కంటే పూల చొక్కా అంటే ఇష్టంమొక్క జొన్న పొత్తు కి ఉప్పు కారం అద్దుకొని తినడం ఇష్టంశని అది వారాల్లో స్నానాలు చెయ్య బుద్ది కాదండీ, అసలు ఎందుకు చెయ్యాలి ?ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టనే పట్టాడు సుమాసచిన్ కి భారత రత్న ఇవ్వరాదు !! ఇంకా కొన్ని సంవత్సారాలు ఆగాల్సిందే !!
మాదిరి చొప్పదంటు సమాచారం ఇంటర్నెట్ లో ప్రపంచం అంతా చాటేసుకోవడం మనకి ప్రస్తుత సరదా. మన లాంటి కోన్ కిస్కా గొట్టం గోపాల కృష్ణ లాంటి అభిప్రాయాలు కొంత మందిని ప్రభావితం చేస్తే ప్రపంచానికి ఒనగూరే (అ) ప్రయోజనం కొద్ది మాత్రమే. అయినా కాని నా నించి నా చుట్టూ ఉన్నసమాజం శాస్త్ర బద్ధ జీవనం ఆశిస్తూ ఉన్న అప్పుడు, ఈ పెద్దలందరికీ ఏ నిభందనలు వర్తించవా ?
మరి ఎవడికి వాడు వాడి ఇష్టానుసారం భావ వ్యక్తీకరణ జరపలేనప్పుడు ఎందుకండీ ఈ ప్రజా స్వామ్యం, స్వతంత్రం ? దిబ్బలో వేసి కొట్టుకోవడానికా ? అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించండి. చరిత్ర లో తమకి అబ్బిన, సిద్దించిన గుణాల ఆధారంగా వారి వారి కాలమానాల్లో ప్రసిద్ది గాంచిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే చిరస్మరణీయులు. కాగ వీళ్ళందరి లో ప్రస్పుటం గా కనిపించేది "ఒదిగి" ఉండగలగడమే. మరియు వీరంతా నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొన్నవాళ్ళే. కొద్ది కాలం క్రితమే ప్రముఖ మైన విప్లవాలకి కారణమైన సమాచార మనే పదునైన ఆయుధం, అత్యంత ప్రమాదకరం కాగలదన్న చిన్నపాటి సత్యం సమాజం లో ఉన్నత స్తానాల్లో ఉన్నవాళ్ళ కి తెలియదు అని అనుకోగలమా ? ఆలోచించవలసిందే మరి !!